ఇప్పుడు ప్రపంచం మొత్తం టెక్నాలజీకి చాలా అలవాటు పడిపోయింది. ఇది తెలిసిన విషయమే. చిన్న పనుల నుండి పెద్ద పనుల వరకు అన్నీ దాదాపు టెక్నాలజీ మీదే నడుస్తున్నాయి. టెక్నాలజీ వల్ల చాలా పనులు సులభం అవుతున్నాయి కూడా. అయితే మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే ఆ వెళ్లాల్సిన రూట్ మనకి బాగా తెలిసి ఉండాలి అని రూలేమీ లేదు.

groom reached wrong venue

ఇలాంటి సందర్భాల్లో రూట్ కనుక్కోవడానికి మనం రెండు ఆప్షన్లు ఎంచుకుంటాం. ఒకటి మనం వెళ్లే దారిలో ఎవరినైనా అడిగి అడ్రస్ కనుక్కొని వెళ్లడం. రెండవది గూగుల్ మ్యాప్స్. మధ్య మధ్యలో ఆగి అక్కడ ఎవరైనా వెళ్ళే వాళ్ళని ఆపి, లేదా అక్కడ ఉన్న వాళ్ల దగ్గరికి వెళ్లి అడ్రస్ కనుక్కొని వెళ్ళడం అంటే కొంచెం టైమ్ తీసుకునే ప్రాసెస్.

groom reached wrong venue

దీనితో పోలిస్తే గూగుల్ మ్యాప్స్ సులభంగా గైడ్ చేస్తుంది. అందుకే మనందరం రెండవ ఆప్షన్ ఎక్కువగా ఎంచుకుంటాం. కానీ ఒక్కొక్కసారి గూగుల్ మ్యాప్స్ కూడా తప్పుగా చూపిస్తూ ఉంటుంది. మన డెస్టినేషన్ వచ్చేసినా కూడా ఇంకా ముందుకు వెళ్లాలి అన్నట్టు గూగుల్ మ్యాప్స్ డైరెక్ట్ చేస్తూ ఉంటుంది.

groom reached wrong venue

ఒక్కొక్కసారి ఈ పొరపాట్లు కొన్ని అనుకోని సంఘటనలకి దారి తీస్తాయి. వివరాల్లోకి వెళితే. ఇండోనేషియాలో ఒక గ్రామంలో ఒక వ్యక్తి పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లి వెన్యూకి గూగుల్ మ్యాప్స్ సహాయంతో పెళ్లి కొడుకు తన కుటుంబంతో సహా చేరుకున్నారు. రెండు వైపుల వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చుకోవడం మొదలుపెట్టారు. కానీ ఒకసారి మొత్తం గమనిస్తే వారికి తెలిసింది ఏంటి అంటే ఆ అబ్బాయి వేరే డెస్టినేషన్ కి వెళ్లారు.

groom reached wrong venue

ఉల్ఫా అనే యువతికి అదే రోజు, అదే గ్రామంలో, అదే టైంకి ఎంగేజ్మెంట్ జరగబోతోంది. పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చే సమయంలో ఉల్ఫా మేకప్ చేసుకుంటున్నారు. కాబట్టి వచ్చిన పెళ్ళికొడుకు గురించి తనకి తెలియదు. ఉల్ఫాకి కాబోయే భర్త దారిలో రెస్ట్ రూమ్ కోసం ఆగడంతో వారికి రావడానికి ఆలస్యం అయ్యింది.

groom reached wrong venue

ఈ విషయంపై ఉల్ఫా మాట్లాడుతూ తనకి కాబోయే భర్త స్థానంలో వేరొకరు ఉండటం, అలాగే వారి బంధువులని చూసి షాక్ అయ్యాను అని, ఎందుకంటే వాళ్ళలో ఎవరూ తనకి తెలియదు అని అన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

watch video :