కత్తి కార్తీక పాపులర్ టీవీ యాంకర్ , బిగ్  బాస్ సీజన్లో 1 కంటెస్టెంట్ కాంగ్రెస్ పార్టీ లోకి అడుగుపెట్టబోతున్నారు. ఇటీవలే కార్తీక టి .పి .సి .సి చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ని కలిసి తనకు పార్టీ పై ఉన్న ఆసక్తిని గురించి చర్చించారు . 2020 నవంబర్ దుబ్బాక బై ఎలక్షన్స్ లో పోటీ చేసి ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొని చివరికి ఓటమిని చవిచూసారు .
kathi kaarthika
ఏదైనా ఒక రాజకీయ పార్టీ సపోర్ట్ ఉంటె మంచిది అని భావించిన కార్తీక కాంగ్రెస్ పార్టీలోకి చేరుటకు ఆసక్తి కనబరుస్తున్నారు. కత్తి కార్తీక కాంగ్రెస్ లోకి చేరటం ఒకరకం గా తెలంగాణ రాజకీయాల్లో ఆందోళన కలుగచేస్తోంది. టి ఆర్ ఎస్ కీలకనేత , డిప్యూటీ స్పీకర్ పద్మారావు కు బంధువు కావటం గమనార్హం. కత్తి కార్తీక త్వరలో కాంగ్రెస్ కండువా వేసుకోనున్నారు..