Ads
Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ కొద్దిరోజుల క్రితం కన్నుమూసిన సంగతి తెలిసిందే. నిజానికి కృష్ణ ఫ్యామిలీ నుంచి ఆయన పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా తొలిసారి ఎంట్రీ ఇచ్చాడు. కృష్ణ మొదటి కుమారుడు రమేష్ బాబు హీరోగా అరంగేట్రం చేసి ఆ తర్వాత నటన పెద్దగా కలిసి రాకపోవడంతో నటన నుంచి ప్రొడక్షన్ వైపు మళ్లాడు.
Video Advertisement
నిర్మాతగా కూడా ఎన్నో ప్రాజెక్టులు చేసిన ఆయన ఎందుకో ఆక్టివ్ గా ఉండలేకపోయారు. అయితే ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు హీరోగా తన సత్తా చాటాడు. ఎన్నో సినిమాలతో తండ్రి వారసుడిగా మారాడు. ప్రస్తుతం మహేష్ బాబు కృష్ణ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అయితే మంజుల వారి కుటుంబం నుంచి నటిగా ఎంట్రీ ఇచ్చింది. బాలకృష్ణతో సినిమా చేయాలనుకుంది కానీ అభిమానుల ఆగ్రహానికి భయపడి వెనక్కి తగ్గింది. అయితే అది అలా ఉంటే వారి కుటుంబం నుంచి కృష్ణ కూతురు పద్మావతి, గల్లా జయదేవ్ ల కొడుకు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులు కొట్టేయాలని ప్రయత్నించారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో కృష్ణ కుటుంబం నుండి ముగ్గురు ఉన్నారు. ఒకరు మహేష్ బాబు, మరొకరు సుధీర్ బాబు మరియు గల్లా అశోక్. కృష్ణ జీవించి ఉండగానే హీరో సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు గల్లా అశోక్. అలాగే కృష్ణ కూతురు ప్రియదర్శిని పెళ్లి చేసుకున్న సుధీర్ బాబు కూడా సినిమాల పై ఆసక్తితో సినీ రంగ ప్రవేశం చేశాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ తేజ దర్శకత్వంలో నటించిన నిజం సినిమా మనం అంతా ఈజిగా మారిచిపోలేం. ఈ సినిమాలో మహేష్ బాబు నటనకు ప్రశంసలతో పాటు నంది అవార్డ్ కూడా దక్కాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా స్టార్టింగ్‌లో ‘చందమామ రావే’ అంటూ ఓ పాట ఉంది. టైటిల్ సమయంలో వచ్చే ఈ పాటలో ఓ తల్లి తన బిడ్డకు చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తోంది. ఆ అబ్బాయి ఎవరో కాదు మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయ కృష్ణ. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కృష్ణ చిన్న కర్మనాడు ఆ విషయం బయటకు వచ్చింది. అదేమిటంటే రమేష్ బాబు తనయుడు జయకృష్ణ సినిమా రంగప్రవేశానికి సిద్ధమవుతున్నాడు. కృష్ణ ప్రోత్సాహం మేరకు అమెరికా వెళ్లి నటనలో శిక్షణ తీసుకున్నాడు. కృష్ణ చనిపోయిన తర్వాత జయకృష్ణ ఆయన్ను చూసేందుకు కూడా రాలేకపోయారు. అమెరికా నుండి వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. ఇటీవల హైదరాబాద్‌కు చేరుకున్న ఆయనతో కలిసి మహేష్ బాబు దిగిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జయకృష్ణను మహేష్ బాబు స్వయంగా లాంచ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కృష్ణ లేకపోవడంతో అన్నయ్య రమేష్ బాబు కుటుంబ బాధ్యతలను మహేష్ బాబు చూసుకుంటాడని అంటున్నారు. ఆ ఫోటోలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
End of Article