గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు ఇదంతా నిజంగా చేయలేదా..? భలే కవర్ చేశారుగా..?

గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు ఇదంతా నిజంగా చేయలేదా..? భలే కవర్ చేశారుగా..?

by Mohana Priya

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా ఇది.

Video Advertisement

ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించారు. మీనాక్షి చౌదరి ఒక ముఖ్య పాత్రలో నటించారు. తల్లి, కొడుకుల మధ్య ఈ సినిమా నడుస్తుంది. రమ్యకృష్ణన్ మహేష్ బాబు తల్లి పాత్రలో నటించారు. అయితే, సినిమా స్టోరీ రొటీన్ గానే ఉంది. చాలా సార్లు చూసిన కథ.

guntur kaaram movie review

కానీ మహేష్ బాబు పాత్రని రూపొందించిన విధానం మాత్రం కొత్తగా ఉంది. దాంతో సినిమా చూసిన వారందరూ కూడా మహేష్ బాబు నటనని మెచ్చుకుంటున్నారు. మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం పొగ తాగడాన్ని వదిలేసారు అనే సంగతి తెలిసింది. అలాగే మద్యపానం కూడా సేవించరు. తన సినిమాల్లో అలాంటి సీన్స్ చూసి అభిమానులు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి అనే కారణంగా తన సినిమాల్లో స్మోకింగ్, మద్యపానం తాగడం వంటి సీన్స్ అవసరం అయితే అసలు ఉండకుండా చూసుకుంటాను అని చెప్పారు.

guntur kaaram movie review

ఒకవేళ సినిమాకి అవసరం అయ్యి అలాంటి సీన్స్ ఉన్నా కూడా తాను మాత్రం వాటి జోలికి వెళ్ళను అని చెప్పారు. అయితే, ఈ సినిమాలో మహేష్ బాబు బీడీ కాలుస్తూనే ఉంటారు. సినిమా మొత్తంలో సగం సినిమాకి పైన మహేష్ బాబు బీడీతోనే కనిపిస్తారు. మహేష్ బాబు గత సినిమాల్లో ఏదో ఒక మెసేజ్ ఉండేది. కానీ ఈ సినిమాలో అలాంటి మెసేజ్ ఏమీ లేదు. దాంతో ఈ సినిమాలో మెసేజ్ లేకపోవడంతో పాటు, మహేష్ బాబు మళ్లీ స్మోకింగ్ కూడా చేస్తున్నారు అని అన్నారు. అయితే ఇవాళ సినిమా బృందం ఒక ఇంటర్వ్యూ విడుదల చేసింది. సుమ ఇంటర్వ్యూ చేశారు.

ఇందులో మహేష్ బాబుతో పాటు హీరోయిన్ శ్రీలీల కూడా పాల్గొన్నారు. అయితే స్మోకింగ్ కి సంబంధించి ఈ సినిమాకి అలాంటి సీన్స్ ఎలా డిజైన్ చేశారో మహేష్ బాబు చెప్పారు. ఈ సినిమాలో మహేష్ బాబు వాడింది నిజమైన బీడీ కాదు. సినిమా షూటింగ్ జరుగుతున్న రోజు బీడీ సీన్ చేయాల్సి వచ్చినప్పుడు నిజమైన బీడీని తాగడానికి ప్రయత్నించినప్పుడు మహేష్ బాబుకి మైగ్రేన్ వచ్చి తలనొప్పి వచ్చిందట.

దాంతో సినిమా బృందానికి ఈ విషయం చెప్పడంతో, వాళ్ళు ఈ విషయం మీద జాగ్రత్త తీసుకున్నారు.  మహేష్ బాబు తాగే బీడీని లవంగం ఆకులతో తయారు చేశారు. ఈ బీడీలు టొబాకోతో తయారు చేయలేదు. అసలు టొబాకోని ఈ బీడీల కోసం వాడలేదు. అది ఒక ఆయుర్వేదిక్ బీడీ అని మహేష్ బాబు చెప్పారు. “చూడడానికి బీడిలాగా కనిపించినా కూడా అవన్నీ లవంగం ఆకులతో తయారు చేశారు. తాగుతున్నప్పుడు లవంగం వాసన మాత్రమే వచ్చేది” అని అన్నారు.

శ్రీలీల విషయం గురించి చెప్తూ, “బీడీ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు ఒక టాస్క్ ఉండేది” అని, “ఆయుర్వేదిక్ బీడీలు కాబట్టి వాటిని మామూలుగా తీసుకువచ్చేవారు. ఆ తర్వాత వాటిని బీడీ డబ్బాలో పెట్టేవారు” అని చెప్పారు. అయితే సినిమా చూసిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు నిజమైన బీడీ అనుకున్నాం కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

watch video :


End of Article

You may also like