“గుంటూరు కారం” సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది… ఎవ్వరూ ఊహించని రేటింగ్ ఇచ్చిన ఉమైర్ సంధు!

“గుంటూరు కారం” సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది… ఎవ్వరూ ఊహించని రేటింగ్ ఇచ్చిన ఉమైర్ సంధు!

by Mounika Singaluri

Ads

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా ఇది. మొదటి సినిమా అతిధి సూపర్ హిట్ కాగా ఖలేజా సినిమా మాత్రం కలెక్షన్ల పరంగా అంతంత మాత్రంగా నిలిచింది. అయితే టీవీలో వస్తే మాత్రం ఈ సినిమాని ఓ రేంజ్ లో ఆదరిస్తున్నారు ప్రేక్షకులు.

Video Advertisement

ఇక మూడవ సినిమా గా రాబోతున్న గుంటూరు కారం ఎలా ఉండబోతుందో అనేది రేపు 12వ తారీఖున తెలియబోతుంది. అయితే సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ బయటికి వచ్చింది సినీ క్రిటిక్ ని, సెన్సార్ సభ్యుడిని అని చెప్పుకునే ఉమైర్ సంధు ఈ సినిమాకి ఫస్ట్ రివ్యూ ని ఇచ్చాడు. మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుందని మహేష్ బాబు నటన ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పుకొచ్చాడు.

మహేష్ బాబు నటన, ఎంటర్టైన్మెంట్ సినిమాలో బాగా వర్క్ అవుట్ అయ్యాయి, మాస్ ఆడియన్స్ ఈ సినిమాని బాగా ఆదరిస్తారు. పండగ సీజన్లో ఈ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది పొటెన్షియాలిటీ ఉన్న కథ అనే సినిమా గురించి గొప్పగా చెప్తూ 3.5/5 రేటింగ్ కూడా ఇచ్చాడు ఉమైర్ సంధు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చాలా సందర్భాలలో అతను ఇచ్చిన రివ్యూ చాలాసార్లు ఫెయిల్ అయింది.

అంతేకాకుండా ఈ సినిమాకి పోటీగా బరిలో నాగార్జున, వెంకటేష్ సినిమాలు కూడా ఉన్నాయి. పెద్ద హీరో కాకపోయినప్పటికీ హనుమాన్ సినిమా కూడా గట్టి పోటీని ఇస్తుంది అంటున్నారు సినీ క్రిటిక్స్. దానికి తోడు సినిమా ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ఇందులో త్రివిక్రమ్ మార్కు ఎక్కడా కనిపించడం లేదు అంటూ పెదవి విరిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఏది ఏమైనాపటికి ఈ సినిమా హిట్టు ఫట్టు అనేది మరొక ఐదు రోజుల్లో తెలిసిపోతుంది.


End of Article

You may also like