బాలయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేసిన జగతి మేడం.? సీరియల్ లో తల్లి పాత్ర…మరి సినిమాలో ఏంటంటే.?

బాలయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేసిన జగతి మేడం.? సీరియల్ లో తల్లి పాత్ర…మరి సినిమాలో ఏంటంటే.?

by Harika

Ads

గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న నటి జ్యోతి రాయ్. సీరియల్స్ లో చాలా చక్కగా సాంప్రదాయబద్ధంగా కనిపించే ఈమె బయట మాత్రం ట్రెండీ లుక్ తో ఫోటో షూట్ లతో చూసేవాళ్ళ మతులు పోగొడుతూ ఉంటుంది. ఈ అందంతోనే ఆమె అనేక సినీ ఆఫర్లను దక్కించుకుంటుంది. ఆ మధ్య ఎన్టీఆర్ సినిమాలో తనకి ఆఫర్ వచ్చినట్లు పరోక్షంగా తెలియజేస్తూ ఒక పోస్ట్ ని పెట్టింది జ్యోతిరాయ్.

Video Advertisement

ఇంత పెద్ద సినిమాలో ఈవిడకి ఆఫర్ ఎలా వచ్చింది అని అందరూ ముక్కున వేలు వేసుకునే లోపు అంతకు మించిన న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. ఇప్పటివరకు అబ్బాయి అనుకుంటే ఇప్పుడు ఏకంగా బాబాయి సినిమాలో ఛాన్స్ కొట్టేసి అందర్నీ మరింత ఆశ్చర్యం లో ముంచెత్తింది. మీరు విన్నది నిజమేనండి ఇప్పుడు ఆమె నందమూరి నటసింహం బాలయ్య సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుందని ప్రచారం సాగుతుంది.

బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీలో ఒక కీలక పాత్ర పోషించే ఛాన్స్ వచ్చిందని అందరూ అంటున్నారు. అదే ఎన్ బీ కే 109 మూవీ. అఖండ సినిమాలో పూర్ణ కి ఎంత మంచి పాత్ర వచ్చిందో అలాంటి పాత్ర జ్యోతిరాయ్ కి ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా హిట్ అయితే కనుక ఆమె మీద ఉన్న నెగిటివ్ ప్రచారం కాస్త తగ్గుతుందని చెప్పాలి. ఏదైతేనేం కెరియర్ ముందుకెళ్లటం కోసం గ్లామర్ డోస్ ని పెంచుకుంటూ పోతుంది.

కుర్రభాములకు పోటీగా పొట్టి పొట్టి దుస్తుల్లో లుక్స్ తో కుర్రాళ్ళ హార్ట్ బీట్ ని పెంచే ఫోటోషూట్లు చేస్తుంది. యూత్ ఆడియన్స్ కి  ఊపిరాడకుండా చేసిన జ్యోతిరాయ్ శ్రమ వృధా పోలేదు. ఈమె వరుస, దూకుడు చూస్తుంటే ముందు ముందు మరిన్ని సినిమాల్లో మెయిన్ రోల్స్ చేసే అవకాశం అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఆమె అందం అలాంటిది మరి అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.


End of Article

You may also like