ఒకే హోటల్లో భార్యను ప్రియురాలును పక్క పక్క రూమ్ లో పెట్టిన ప్రబుద్ధుడు

ఒకే హోటల్లో భార్యను ప్రియురాలును పక్క పక్క రూమ్ లో పెట్టిన ప్రబుద్ధుడు

by Megha Varna

Ads

సినిమాలకు నిజజీవితాలకు చాలా తేడా ఉంటుంది.ఇది తెలుసుకోకుండా కొందరు ప్రబుద్ధులు సినిమాలలో హీరోలు అందరినీ నవ్వించడానికి చేసిన పనులను నిజజీవితంలో మక్కీ టు మక్కీ కాపీ కొట్టి చిక్కుల్లో పడుతుంటారు.

Video Advertisement

తాజాగా ఇలాంటి సంఘటనే ఒక్కటి బళ్లారిలో చోటు చేసుకుంది.మంజునాథ్ అనే వ్యక్తి బెంగుళూర్ కు చెందిన 21 ఏళ్ల యువతిని ఈ సంవత్సరం మొదట్లో పెళ్లి చేసుకున్నాడు.మార్చి రెండో వారంలో అంటే లాక్ డౌన్ ముందు హనీమూన్ కోసం ఊటీకి భార్యతో కలిసి వెళ్ళాడు.ముందుగా ప్లాన్ చేసుకున్నట్టు తన భార్యతో దిగే హోటల్లో గర్ల్ ఫ్రెండ్ ను ముందే దించాడు.

భార్యను రూంలో ఉంచి ఆఫీసు వర్క్ అంటూ అబద్దాలు చెబుతూ గర్ల్ ఫ్రెండ్ తో ఊటీలో చెట్టాపట్టాలేసుకుని తిరిగేసాడు.లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో తన భార్యతో సొంతూరు తిరిగివచ్చాడు. ఆఫీసు వర్క్ అంటూ రోజు బయటకి వెళ్తున్న భర్త ప్రవర్తన నమ్మ సఖ్యంగా లేకపోవడంతో భార్య అతని ఫోన్ ను సీక్రెట్ గా ఓపెన్ చేసి చూసింది .

అందులో మంజునాథ్ తన ప్రియురాలితో కలిసి దిగిన ఫోటోలను చూసిన భార్య.భర్తను ఈ విషయం పై నిలదీసింది.దానికి మంజునాథ్ తనకు 25 లక్షలు ఇస్తేనే కాపురం చేస్తానని ఆమెతో అన్నాడు.దానితో ఆమె తన తల్లిదండ్రులతో కలిసి మంజునాథ్ పై కేసు పెట్టింది.విషయం తెలుసుకున్న నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

 


End of Article

You may also like