HANUMAN 11 DAYS COLLECTIONS: బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకెళ్తున్న “హనుమాన్”…11 వ రోజు కూడా రికార్డ్.!

HANUMAN 11 DAYS COLLECTIONS: బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకెళ్తున్న “హనుమాన్”…11 వ రోజు కూడా రికార్డ్.!

by Mounika Singaluri

Ads

సంక్రాంతి పండగ అంటేనే సినిమాల పండగ. చాలా సినిమాలు సంక్రాంతికి విడుదల అవుతాయి. ఈ సంవత్సరం కూడా అలాగే విడుదల అయ్యాయి. పెద్ద హీరోల సినిమాలతో పాటు యంగ్ హీరోల సినిమాలు కూడా ఇందులో ఉన్నాయి. వాటిలో పాన్-ఇండియన్ సినిమాగా విడుదల అయ్యి హిట్ సాధించిన సినిమా హనుమాన్. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు.

Video Advertisement

ఒకపక్క జై శ్రీరామ్ నినాదం మారుమోగితే మరోపక్క హనుమాన్ మూవీ కలెక్షన్లతో సునామీ సృష్టించింది. రిలీజ్ అయ్యి 10 రోజులవుతున్న కూడా హనుమాన్ మూవీ సందడి ఎక్కడా తగ్గలేదు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లు కలెక్షన్ సాధించింది. 2024 లో 200 కోట్లు కలెక్షన్ సాధించడం మొదటి భారత చిత్రంగా రికార్డు సృష్టించింది. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం 200 కోట్లు మార్కులు చేరుకున్నట్లు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11వ రోజు కూడా కలెక్షన్స్ లో దూసుకుపోతుంది. డే 11 రికార్డ్ ను సొంతం చేసుకుంది. 3.34 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది హనుమాన్ సినిమా. మిడ్ రేంజ్ మూవీస్ లో రికార్డ్ కొట్టింది. గతంలో గీతగోవిందం 2.21Cr , జాతిరత్నాలు 2.15Cr షేర్ ని సొంతం చేసుకున్నాయి.

ఈ సినిమాకి రెండవ భాగం అయిన జై హనుమాన్ కూడా 2025 లో విడుదల అవుతుంది అని సినిమా బృందం ఇప్పటికే ప్రకటించారు.మొదట తక్కువ స్క్రీన్స్ లో విడుదల అయిన ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చాక స్క్రీన్స్ పెంచారు. ఈ సినిమాని నిరంజన్ రెడ్డి నిర్మించారు.మొదట తక్కువ స్క్రీన్స్ లో విడుదల అయిన ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చాక స్క్రీన్స్ పెంచారు. అయితే అంత లాభాలు వచ్చినా కానీ ఆ లాభాల్లో కొంత వరకు కూడా నిరంజన్ రెడ్డికి రాలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం, ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ని మైత్రి డిస్ట్రిబ్యూషన్స్ సొంతం చేసుకుంది. హిందీ విషయంలో కూడా ఇదే పని చేసినట్టు సమాచారం.

 


End of Article

You may also like