“హనుమాన్” మూవీ బడ్జెట్ 50 కోట్లు.. హీరో “తేజ సజ్జా” తో పాటు, ఇతర యాక్టర్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

“హనుమాన్” మూవీ బడ్జెట్ 50 కోట్లు.. హీరో “తేజ సజ్జా” తో పాటు, ఇతర యాక్టర్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

by kavitha

Ads

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ‘హనుమాన్’ ఒకటి. ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న చిత్రాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

Video Advertisement

యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ మూవీ పై క్యూరియాసిటీని పెంచాయి. మరి కొద్ది గంటలలో రిలీజ్ కానున్న ఈ మూవీ బడ్జెట్, రెమ్యునరేషన్ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తేజ సజ్జ, అమృత అయ్యర్ లు జంటగా నటిస్తున్న ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీలో పవర్ ఫుల్ విలన్ గా వినయ్ రాయ్ నటించారు. ఈ సినిమా బడ్జెట్ 50 కోట్ల రూపాయలు. ఇందులో నటించిన నటీనటుల రెమ్యూనరేషన్ నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది.
తేజ సజ్జా:

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘చూడాలని ఉంది’ మూవీతో బాలనటుడుగా కెరీర్ మొదలుపెట్టిన తేజ సజ్జా, జాంబీ రెడ్డి మూవీతో హీరోగా మారాడు. తొలి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తేజ సజ్జా రూ. 5 వేల పారితోషికం అందుకోగా, హనుమాన్ మూవీకి రూ. 2 కోట్లు అందుకున్నాడని టాక్.
అమృత అయ్యర్:

హనుమాన్ మూవీలో మీనాక్షిగా అమృత అయ్యార్ అలరించనుంది. ఈ సినిమా కోసం అమృత దాదాపు రూ. 1.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందని తెలుస్తోంది.
వరలక్ష్మీ శరత్ కుమార్:

ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్  పలు తెలుగు సినిమాలలో విలన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  హనుమాన్ సినిమాలో తేజ సజ్జా అక్క అంజమ్మ పాత్రలో నటిస్తున్నారు.  ఈ మూవీకి గాను వరలక్ష్మీ కోటి రూపాయల వరకు అందుకున్నట్లు తెలుస్తోంది.
వినయ్ రాయ్:

వాన మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన  వినయ్ రాయ్, ఆ తరువాత కీలక పాత్రలలో, విలన్ గా నటిస్తున్నారు.  హానుమాన్ సినిమాలో పవర్ ఫుల్ విలన్‌ మైఖేల్‌ పాత్రలో  వినయ్ రాయ్ నటిస్తున్నారు. ఈ మూవీకి వినయ్ రాయ్ 65 లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.
వెన్నెల కిశోర్: 

పాపులర్ కమెడియన్ అయిన వెన్నెల కిశోర్ హనుమాన్ మూవీకి గాను రూ. 55 లక్షలు తీసుకున్నారని టాక్.హనుమాన్ మూవీలో నటించిన ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ రాజ్ దీపక్ శెట్టి రూ. 85 లక్షలు, గెటప్ శ్రీను 35 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: సడన్ గా OTT లోకి వచ్చిన ఈ కొత్త సినిమా చూశారా..? ఎందులో స్ట్రీమ్ అవుతోంది అంటే..?


End of Article

You may also like