Home News HANUMAN FOR SRIRAM: టికెట్ కి 5 రూపాయల చొప్పున…”హనుమాన్ టీం” అయోధ్యకి మొత్తం ఎంత డొనేట్ చేసారో తెలుసా.?

HANUMAN FOR SRIRAM: టికెట్ కి 5 రూపాయల చొప్పున…”హనుమాన్ టీం” అయోధ్యకి మొత్తం ఎంత డొనేట్ చేసారో తెలుసా.?

by Sainath Gopi

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి దేశం మొత్తం సమయతమైంది. దేశ నలుమూలల్లో ఉన్న సామాన్యుల దగ్గర నుండి ధనవంతులు వరకు ప్రతి ఒక్కరు తమకు తోచినంత విధంగా రామ మందిరానికి విరాళాలు అందిస్తున్నారు. అయితే రామమందిర్ ఆలయానికి హనుమాన్ మూవీ టీం కూడా భారీ మొత్తంలో విరాళాన్ని ప్రకటించింది.

ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది. ఇప్పటికీ కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా మీద వచ్చే ప్రతి టిక్కెట్ మీద ఐదు రూపాయలు రామ మందిరానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

సినిమా టీం ప్రకటించినట్లుగానే ఇప్పటివరకు హనుమాన్ సినిమాకి 53,28,211 11 టిక్కెట్లు అమ్ముడు అయ్యాయి. ప్రతి టిక్కెట్ కి ఐదు రూపాయలు చొప్పున వాటి ద్వారా వచ్చిన రూ.2,66,41,045 మొత్తాన్ని హనుమాన్ టీం రామ మందిరం నిర్మాణ ట్రస్ట్ కి అందజేశారు. ఈ కార్యక్రమానికి హనుమాన్ ఫర్ శ్రీరామ అని పేరు పెట్టి విరాళం మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ ఔదార్యానికి హనుమాన్ మూవీ టీం ని పలువురు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

You may also like