Ads
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మకు గౌరవంగా తప్పుకునే అవకాశం ఇస్తారని అందరూ భావించారు. కానీ ముంబయి ఇండియన్స్ మేనేజ్మెంట్ అనూహ్యరీతిలో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్ గా నియమించింది.ఈ హఠాత్ పరిణామం వల్ల క్రికెట్ వర్గాలు సైతం ఆశ్చర్యానికి గురి అయ్యారు.రోహిత్ అభిమానులైతే తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ మీడియాలో దీనిపై ఓ ఆసక్తికర కథనం వచ్చింది.
Video Advertisement
ముంబయి ఇండియన్స్ టీంకు తనను కెప్టెన్ గా నియమించే షరతుపైనే హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ ను వీడి వచ్చాడని ఇండియన్ ఎక్స్ ప్రెస్ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది.
ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ కు రెండు సీజన్ల పాటు కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా తొలి సీజన్ లోనే టైటిల్ అందించి రికార్డ్ సృష్టించాడు.రెండోసారి ఫైనల్ వరకు జట్టును తీసుకెళ్లాడు. కెప్టెన్ గా తాన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు మరలా ముంబయి ఇండియన్స్ కు వచ్చి సాధారణ ఆటగాడిలా ఉండాలని తాను కోరుకోవడంలేదని పరోక్షంగా ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా స్పష్టం చేసినట్టు ఈ కథనంలో పేర్కొన్నారు.
కెప్టెన్సీ మార్పు అంశంపై రోహిత్ శర్మకు వరల్డ్ కప్ జరిగే సమయంలోనే ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ తెలియజేసినట్టు కూడా ఆ కథనంలో తెలిపారు.
End of Article