Home Filmy Adda “అందుకే ఇలాంటి బట్టలు వేసుకొని తిరుగుతోంది..!” అంటూ…అషు రెడ్డిపై హరి కామెంట్స్..!

“అందుకే ఇలాంటి బట్టలు వేసుకొని తిరుగుతోంది..!” అంటూ…అషు రెడ్డిపై హరి కామెంట్స్..!

by Mohana Priya

ప్రతి ఆదివారం స్టార్ మా లో టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రాం కామెడీ స్టార్స్. ఈ ప్రోగ్రాం కి ఇంతకుముందు వర్షిణి యాంకర్ గా వ్యవహరించే వారు. కానీ ఇప్పుడు శ్రీముఖి యాంకర్ గా వస్తున్నారు, దీనికి శేఖర్ మాస్టర్, ఇంకా ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన శ్రీదేవి విజయ్ కుమార్ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు.hari comments on ashu reddy in comedy stars

అయితే, రాబోయే ఎపిసోడ్ సంబంధించిన ప్రోమో ఇవాళ విడుదల అయ్యింది. ఇందులో అషు రెడ్డి, హరి స్కిట్ కి సంబంధించిన వీడియో విడుదల చేశారు. ఇందులో అషు రెడ్డి, హరి ప్రేమించుకుంటారు. వారి ప్రేమ గురించి అషు రెడ్డి తన అన్నలకి చెప్పి ఒప్పించమని హరిని అడుగుతారు. ఈ స్కిట్ లో మహేష్ విట్ట కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారు. అషు రెడ్డి తన అన్నలను పరిచయం చేస్తూ చిన్నప్పటి నుంచి నన్ను వీళ్ళు పెంచారు అని చెప్తారు.hari comments on ashu reddy in comedy stars

అందుకు హరి, “వీళ్లు నిన్ను పెంచినట్టు లేదు. కిడ్నాప్ చేసినట్టు ఉంది” అని అంటారు. అయితే, ఇందులో మహేష్ విట్ట “మా చెల్లిని మేము నెత్తి మీద పెట్టుకొని పెంచాము” అంటే, అందుకు హరి “తెలుస్తోంది. మొత్తానికి నేల మీద అయితే పెట్టి పెంచలేదు. అందుకే ఇలాంటి బట్టలేసుకొని తిరుగుతోంది” అని అన్నారు. అంతే కాకుండా హరికి చెల్లి ఉంటే మాత్రమే తమ చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేస్తామని మహేష్ విట్ట అంటారు. దాంతో హరి తన చెల్లెలు అని ఒకరిని తీసుకొస్తారు.

watch video :

You may also like