”హరి హర వీర మల్లు” సినిమాని… ఆ వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారా..? అయన ఎవరంటే..?

”హరి హర వీర మల్లు” సినిమాని… ఆ వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారా..? అయన ఎవరంటే..?

by Megha Varna

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో మన ముందుకి త్వరలోనే రానున్నారు. ఈ సినిమా టీజర్ ని కూడా ఎప్పుడో విడుదల చేశారు. ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. అలానే నర్గీస్ ఫక్రీ కూడా హీరోయిన్ గా చేస్తున్నారు.

Video Advertisement

ఈ సినిమాకి కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. ఇది ఒక పిరియాడిక్ సినిమాగా రూపొందుతోంది.

ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ యుద్ధాలు చేయడం కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ఈ సినిమా లో ఇంకా చాలా మంది పెద్ద పెద్ద ప్రముఖ నటీ నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కూడా ఎన్నో కారణాల వల్ల ఆలస్యం అయ్యింది.

ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ సినిమాని ”పండుగ సాయన్న” పాత్రను ఆధారంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అని వార్తలు వస్తున్నాయి. మరి ఎలా ఈ పాత్ర ఆధారంగా స్టోరీ ఉంటుందనేది చూడాలి. ఈ సినిమాను కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తారు. షూటింగ్ మాత్రం చాల ఆలస్యంగా అవుతోంది. దీని కారణం పవర్ స్టార్ బిజీగా ఉండడమే. పవన్ బిజీగా ఉండటంతో హరి హర వీర మల్లు షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది.

 

 


End of Article

You may also like