Ads
బిగ్ బాస్ లో ఏమైనా జరగొచ్చు అనడానికి ఉదాహరణ నిన్న నోయల్ ఎలిమినేట్ అవ్వడం. గత వారం వరకు కూడా ఎంతో యాక్టివ్ గా అన్నిట్లో పార్టిసిపేట్ చేసిన నోయల్ కి, ఈ వారం ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. సమస్య కొంచెం సీరియస్ అవ్వడంతో నోయల్ ట్రీట్మెంట్ కోసం బిగ్ బాస్ ఇంటి నుండి బయటికి వెళ్లిపోవాల్సి వచ్చింది. కానీ నోయల్ బిగ్ బాస్ హౌస్ కి తిరిగి వస్తారు అని అందరూ అనుకున్నారు.
Video Advertisement

శనివారం ఎపిసోడ్ లో నోయల్ ఎలిమినేట్ అయ్యారు అని నాగార్జున ప్రకటించారు. నోయల్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నారు అని కూడా చెప్పారు. దాంతో ప్రేక్షకులందరూ షాక్ అయ్యారు. సాక్షి కథనం ప్రకారం నోయల్ కి వచ్చిన ఆరోగ్య సమస్య యాంకైలోజింగ్ (ఆంకిలోసింగ్) స్పాండిలైటిస్. ఇది ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్య. దీని వల్ల వెన్నెముక భాగంలో అలాగే మెడ భాగంలో నొప్పిగా ఉంటుంది. 
ఈ నొప్పి లోయర్ బ్యాక్ లో మొదలయ్యి తర్వాత మెడ భాగం కి స్ప్రెడ్ అవుతుంది. దీని వల్ల శరీరంలో ఉన్న జాయింట్స్ కూడా దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి. దాంతో మనిషికి నడవడంలో, అలాగే నిలబడడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఈ సమస్య ఇంకా ఎక్కువైతే శ్వాస తీసుకోవడంలో, కంటి చూపుపై ప్రభావం పడుతుంది. గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయట.

నోయల్ కి షోకి ఎంటర్ అయినప్పటి నుండి సమస్య ఉన్నా కూడా తట్టుకోగలిగారు. కానీ గత కొద్ది రోజులుగా సమస్య ఇంకా ఎక్కువైంది. నొప్పి కారణంగా టాస్క్ లో కూడా పార్టిసిపేట్ చేయలేకపోయారు. దాంతో ఈ సమస్య ఇంకా పెరగకుండా ఉండాలి అంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అవసరం కాబట్టి షో నుండి బయటికి వెళ్ళవలసి వచ్చింది.
End of Article
