Ads
హైదరాబాద్ మెట్రో ట్రైన్ లో మొట్ట మొదటి సారిగా ఒక గుండెని తరలించారు. నల్గొండ జిల్లాకు చెందిన ఒక రైతు కి బ్రెయిన్ డెడ్ అయ్యింది. దాంతో ఆ వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు గుండె దానం చేయడానికి ముందుకు వచ్చారు. నాగోల్ లోని కామినేని ఆస్పత్రి నుండి జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి గుండెని తీసుకెళ్లారు.
Video Advertisement
అపోలో హాస్పిటల్ నుండి వచ్చిన బృందం 4:40 కి మెట్రో ట్రైన్ లో ప్రయాణం ప్రారంభించింది. 16 స్టేషన్ లని కేవలం 30 నిమిషాల వ్యవధిలో దాటింది. ట్రైన్ దాదాపు 21 కిలోమీటర్లు ప్రయాణించింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. వి. ఎస్ రెడ్డి మాట్లాడుతూ “ఇలా ఒక ప్రాణం కాపాడటం కోసం ట్రైన్ వెళ్లడం ఇదే మొదటిసారి” అని అన్నారు.
End of Article