Home Filmy Adda “హలో బ్రదర్”లోని ఈ పాట కాపీనా..? ఏ సినిమా నుండి అంటే..?

“హలో బ్రదర్”లోని ఈ పాట కాపీనా..? ఏ సినిమా నుండి అంటే..?

by Mohana Priya

సాధారణంగా మన ఆలోచనలలాంటివే ఇంకొకరికి వస్తూ ఉండటం చూస్తూనే ఉంటాం. దానికి కొంత మంది కాపీ అని పేరు పెడితే, కొంత మంది ఇన్స్పిరేషన్ అంటారు. ఇలాంటివి సినిమాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒక సినిమా కథని పోలిన కథతో మరొక సినిమా రావడం, కాస్ట్యూమ్స్ ఒకేలా ఉండడం, ఇలాంటివన్నీ అవుతూనే ఉంటాయి.

ఇంకా కొన్ని సందర్భాల్లో పాటలు ఒకే లాగా ఉండటం కూడా జరుగుతూ ఉంటాయి. అయితే, అలా ఒక సినిమాలో ఒక పాటకి వాడిన ట్యూన్ ఇంకొక పాటకి దగ్గరగా ఉంది. అక్కినేని నాగార్జున హీరోగా ఇవివి సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా హలో బ్రదర్. ఈ సినిమాలో నాగార్జున రెండు పాత్రల్లో నటించారు.

hello brother priya raagale copied from an english song

ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ సృష్టించింది. ఇందులో సౌందర్య. రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించారు. అలాగే బ్రహ్మానందం. గిరిబాబు, అన్నపూర్ణ ఇంకా ఎంతోమంది ముఖ్య పాత్రల్లో నటించారు. చిన్నప్పుడు విడిపోయిన ఇద్దరు కవలలు పెద్దయ్యాక ఎలా కలుస్తారు అనే లైన్ చుట్టూ సినిమా అంతా తిరుగుతుంది. ఈ సినిమా తర్వాత హిందీలో కూడా రీమేక్ అయ్యింది. అందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటించారు. అయితే ఈ సినిమాకి పాటలు కూడా హైలైట్ గా నిలిచాయి.

hello brother priya raagale copied from an english song

ఈ సినిమాకి రాజ్ కోటి సంగీత దర్శకత్వం వహించారు. ఇందులో ప్రియ రాగాలే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ పాట ట్యూన్ ఒక ఇంగ్లీష్ పాట ట్యూన్ కి దగ్గరగా ఉంటుంది. ఈ పాట డీప్ ఫారెస్ట్ వైట్ విస్పర్ అనే ఒక ఇంగ్లిష్ పాట ట్యూన్ కి దగ్గరగా ఉంటుంది. ఈ పాట 1992 లో విడుదల అయ్యింది. కేవలం పాట మొదట్లో వచ్చే మ్యూజిక్ మాత్రమే ఇలా ఒకటేలాగా అనిపిస్తుంది.

watch video :

You may also like