ప్రముఖ కమెడియన్ సునీల్ అస్వస్థతకు గురైనట్టు సమాచారం. గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సునీల్‌ను మాదాపూర్‌లోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది.

Video Advertisement

తాజాగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన అల వైకుంఠపురం చిత్రంలో సునీల్‌ నటించి అందరిని మెప్పించారు. మొన్నటి వరకు కూడా ఆరోగ్యంగానే ఉన్న ఈయన స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడని తెలుస్తుంది. కుటుంబ సభ్యులు వెంటనే మాదాపూర్‌లోని ఏ.ఐ.జి ఆసుపత్రిలో చేర్పించారు. కొన్ని రోజులుగా ఈయన గొంతు, లివర్ సమస్యతో బాధ పడుతున్నాడు.

తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యనటుడిగా, హీరోగా, సపోర్ట్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలో నటించిన సునీల్.. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘అల వైకుంఠపురములో.. ‘ సినిమాలో తన యాక్టింగ్‌తో పాటు.. డ్యాన్స్‌లతోనూ అదరగొట్టారు.