Home Filmy Adda “పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్” లాగానే… తెర వెనుక “బెస్ట్ ఫ్రెండ్స్” అయిన 7 హీరో-డైరెక్టర్ కాంబినేషన్స్..!

“పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్” లాగానే… తెర వెనుక “బెస్ట్ ఫ్రెండ్స్” అయిన 7 హీరో-డైరెక్టర్ కాంబినేషన్స్..!

by Mohana Priya

సినిమా ఇండస్ట్రీలో ఎంత పోటీ ఉంటుందో, అంతే స్నేహం కూడా ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా ఒక హీరో, ఒక దర్శకుడు చాలా కాలం కలిసి ట్రావెల్ చేస్తారు కాబట్టి వారు ఎక్కువగా స్నేహితులు అవుతారు.

అలా మన ఇండస్ట్రీలో ఒక హీరోకి ఒక దర్శకుడు బెస్ట్ ఫ్రెండ్ అవ్వడం జరుగుతూనే ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మంది హీరోలు తమతో పని చేసిన దర్శకులతో స్నేహంగా ఉన్నారు. అలా మన ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది హీరోలకి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్

ఈ జనరేషన్ లో ఉన్న హీరోల్లో ఒక దర్శకుడు, ఒక హీరో బెస్ట్ ఫ్రెండ్ అంటే మొదటిగా గుర్తొచ్చేది వీళ్లిద్దరే. ఎన్నో సంవత్సరాల నుండి వీరి మధ్య స్నేహం ఉంది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ నటించిన ఎన్నో సినిమాలకి త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు రాశారు. ఇటీవల రిలీజ్ అయిన బ్రో సినిమా రూపొందడంలో కూడా త్రివిక్రమ్ చాలా ప్రధాన పాత్ర వహించారు.

hero director best friends off screen

#2 మహేష్ బాబు – వంశీ పైడిపల్లి

మహర్షి సినిమాకి వీరిద్దరూ కలిసి పని చేశారు. ఆ తర్వాత వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు అయ్యారు. మహేష్ బాబుకి సంబంధించిన చాలా ఈవెంట్స్ లో వంశీ పైడిపల్లి పాల్గొంటూ ఉంటారు. వీరి కుటుంబానికి కూడా చాలా మంచి అనుబంధం ఉంది అని సోషల్ మీడియాలో వీరి పిక్చర్స్ చూస్తే అర్థం అవుతుంది.

hero director best friends off screen

#3 జూనియర్ ఎన్టీఆర్ – రాజమౌళి

రాజమౌళి మొదటి హీరో జూనియర్ ఎన్టీఆర్. వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాలకి పని చేశారు. ఆ సినిమాలు అన్నీ కూడా హిట్ అయ్యాయి. అంతే కాకుండా వ్యక్తిగతంగా కూడా వీరిద్దరికీ, అలాగే వీరి కుటుంబాలకి చాలా మంచి స్నేహం ఉంది.

hero director best friends off screen

#4 షారుఖ్ ఖాన్ – కరణ్ జోహార్

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్ చాలా మంచి మిత్రులు. అంతే కాకుండా కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన చాలా సినిమాల్లో షారుఖ్ ఖాన్ హీరోగా కూడా చేశారు. అలా వీరిద్దరి స్నేహం మరింత బలపడింది అని చెప్పవచ్చు.

hero director best friends off screen

#5 శివకార్తికేయన్ – నెల్సన్ దిలీప్ కుమార్

తమిళ్ హీరో శివ కార్తికేయన్, దర్శకుడు నెల్సన్ కూడా చాలా మంచి స్నేహితులు. నెల్సన్ ఇప్పటికి నాలుగు సినిమాలకి దర్శకత్వం వహించారు. అందులో నెల్సన్ రెండవ సినిమా అయిన డాక్టర్ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటించారు. నెల్సన్ మొదటి సినిమా కోలమావు కోకిల, అలాగే మూడవ సినిమా అయిన బీస్ట్ సినిమాలో శివకార్తికేయన్ పాటలు రాశారు. ఇప్పుడు నెల్సన్ జైలర్ సినిమాకి దర్శకత్వం వహించారు. వీరిద్దరి కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది అని అంటారు.

hero director best friends off screen

#6 అల్లు అర్జున్ – సుకుమార్

సుకుమార్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా అయిన ఆర్య లో అల్లు అర్జున్ హీరోగా నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ ఆర్య 2 కి పని చేశారు. ఇటీవల రిలీజ్ అయిన పుష్ప సినిమాతో ఇద్దరూ చాలా మంచి హిట్ కొట్టారు. వీరిద్దరి ఇంటర్వ్యూలు చూస్తే వీళ్లిద్దరూ ఎంత మంచి స్నేహితులు అనే విషయం అర్థం అవుతుంది.

hero director best friends off screen

#7 రవితేజ – పూరి జగన్నాధ్

వీరిద్దరి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు కలిసి ఎన్నో సినిమాలకి పని చేశారు. మళ్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుంది అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరిగా వీరిద్దరూ దేవుడు చేసిన మనుషులు సినిమాకి పని చేశారు.

hero director best friends off screen

వీరు మాత్రమే కాకుండా ఇంకా మన ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో డైరెక్టర్ స్నేహితులు ఉన్నారు.

ALSO READ : JD చక్రవర్తి నటించిన ఈ సిరీస్ చూశారా..? ఎలా ఉంది అంటే..?

You may also like