గత ఏడాది ఈ ఏడాది తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు పెళ్లి చేసుకుంటున్నారు. కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాకుండా మిగిలిన ఇండస్ట్రీలకు చెందిన వారు కూడా ఈ జాబితాలో చేరుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో హీరో కూడా యాడ్ అయ్యారు. ఎక్కడా తెలియకుండా అసలు ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా సడన్ గా ఆ హీరో ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యి వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే, ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కార్తికేయ నిశ్చితార్థం ఆదివారం సాయంత్రం జరిగింది. తన సన్నిహితుల కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని కార్తికేయ పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఈ నిశ్చితార్థ వేడుకలకి సినీ ప్రముఖులు ఎవరూ హాజరు కాలేదు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే నిశ్చితార్థ వేడుక జరిగింది.

ఆ అమ్మాయి కి సంబంధించిన వివరాలు ఏవీ పెద్దగా బయటకు రాలేదు. కానీ కార్తికేయ తన కాబోయే భార్య తో కలిసి దిగిన ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్తికేయ ప్రస్తుతం అజిత్ కుమార్ హీరోగా నటించిన వాలిమై సినిమాలో విలన్ పాత్రలో నటించారు. ఇది తమిళ్ లో కార్తికేయ మొదటి సినిమా. అంతేకాకుండా తెలుగులో కూడా రాజావిక్రమార్క తో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో నటించబోతున్నారు కార్తికేయ.