వైరల్ అవుతున్న “మంచు విష్ణు” లేటెస్ట్ ఫోటో..!

వైరల్ అవుతున్న “మంచు విష్ణు” లేటెస్ట్ ఫోటో..!

by Sunku Sravan

Ads

చాలా గ్యాప్ తర్వాత మంచు విష్ణు నటిస్తున్నటువంటి తాజా చిత్రం “గాలి నాగేశ్వరరావు.” ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ మరియు సన్నీ లియోన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Video Advertisement

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా పనులు చాలా వేగంగా చేస్తున్నారు. ఎంతో కామెడీ ఉండే విధంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

అలాగే మంచు విష్ణు బ్రదర్ మంచు మనోజ్ హీరోగా వచ్చిన ‘కరెంటు తీగ’ సినిమాలో కూడా సన్నీలియోన్ కనిపించింది. ఆ తర్వాత విష్ణు సినిమాలో ఈమె నటిస్తోంది. ఈ షూటింగ్ కారణంగానే గత కొన్ని రోజులుగా సన్నీలియోన్ హైదరాబాదులోనే ఉంటుంది. వీరికి సమయం దొరికినప్పుడల్లా పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ సరదాగా గడుపుతూ ఫన్నీ వీడియోలు చేస్తున్నారు.

ఈ మధ్య ఒక వీడియోలో సన్నీ మరియు పాయల్ ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారని అడిగితే.. మంచు విష్ణు ఒకసారి ఒకరి పేరు తర్వాత ఎవరూ కాదు అని అన్నారు. దీంతో వారిద్దరు కలిసి విష్ణును చితకబాదారు. అయితే విష్ణు మళ్ళీ అలాంటి మరో చిలిపి పని చేశాడు. సన్నీ లియోన్ కు ముద్దు పెడుతున్నట్టు ఫోజిచ్చాడు. ఈ ఫోటో లోనే పాయల్ విక్టరీ సింబల్ చూపిస్తుంది..

ప్రస్తుతం ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది. దీన్ని చూసినటువంటి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.. మంచు విష్ణుకు రొమాన్స్ బాగా ఎక్కువైందని, పబ్లిక్ గా ఇలాంటి పనులు ఏంటి అంటూ విమర్శిస్తున్నారు. దీంతో మంచు విష్ణు నెటిజన్లు మంచు విష్ణు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.


End of Article

You may also like