లాక్ డౌన్ వేళ హీరో నిఖిల్ పెళ్లి…వివాదాల మధ్య ప్రభుత్వం విధించిన షరతులు ఇవే.!

లాక్ డౌన్ వేళ హీరో నిఖిల్ పెళ్లి…వివాదాల మధ్య ప్రభుత్వం విధించిన షరతులు ఇవే.!

by Sainath Gopi

కన్నడ హీరో నిఖిల్‌ గౌడ వివాహం అనుకున్నట్లుగానే జరుగబోతుంది.లక్షలాది పెళ్లిలు వాయిదా పడ్డాయి. పెళ్లిలు అనేవి అసాధ్యం అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ గౌడ పెళ్లికి రెడీ అయ్యాడు.లాక్‌డౌన్ అంశాల మధ్య మాజీ సీఎం కుమారస్వామి తన కుమారుడి వివాహాన్ని జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Video Advertisement

ఈ రోజు బెంగళూరు సమీపంలోని ఒక ఫామ్‌ హౌస్‌లో ఈ పెళ్లిని జరుపబోతున్నారు.పెళ్లికి అక్కడి ప్రభుత్వం కండీషన్స్‌తో కూడిన అనుమతులు ఇవ్వడం జరిగింది.కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ పెళ్లిని జరుపబోతున్నారు. మొదట దానికి కూడా అనుమతి ఇవ్వలేదు. తర్వాత కుమారస్వామి ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పించారు. పెళ్ళికి వచ్చిన ఆ కొద్దిమంది తప్పక మాస్కులు ధరించాలి, సామజిక దూరం పాటించాలి అని షరతులు పెట్టారు. ఎక్కువ హడావిడి లేకుండా జరపాలని పెట్టారు.

మొదట నిఖిల్‌ పెళ్లిని వైభవంగా వంద ఎకరాల స్థలంలో అయిదు లక్షల మంది కార్యకర్తల సమక్షంలో చేయాలని భావించారు. కానీ ఇప్పుడు కరోనా లాక్ డౌన్ కారణంగా ఇలా చేస్తున్నారు. అనుకున్న ముహుర్తానికే నిఖిల్ కుమారస్వామి వివాహం మాజీ మంత్రి ఎం కృష్ణప్ప మనవరాలు రేవతితో శుక్రవారం ఉదయం జరుగుతునున్నది. ఈ వేడుకకు కేతగానహళ్లి పట్టణంలోని ఫామ్‌హౌస్‌లో ఏర్పాట్లు చేసారు.


You may also like

Leave a Comment