ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల దాడికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఈ విషయంపై ఆ దాడిని సమర్ధించేటట్టుగా జో బైడెన్ వ్యాఖ్యలు ఉన్నాయి. జో బైడెన్ మాట్లాడుతూ ప్రజలందరినీ ఒకే చోటకి తీసుకొచ్చి సురక్షిత పాలనను అందించేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తారా అనే విషయంపై స్పష్టత రావాలి అని చెప్పారు. ఒకవేళ వాళ్ళు అలా చేయగలిగితే ఆఫ్ఘనిస్తాన్ కి ఆర్థిక వాణిజ్య రంగాలతో పాటు మిగిలిన రంగాల్లో సహాయం అందిస్తామని చెప్పారు.

దాంతో ఈ విషయంపై హీరో నిఖిల్ స్పందించారు. నిఖిల్ ట్విట్టర్ ద్వారా ఈ విధంగా పేర్కొన్నారు. “21 సంవత్సరాలు ఒక దేశాన్ని ఇబ్బంది పెట్టి తర్వాత ఈ రకంగా వదిలేసారు. మీరు స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారా? మిస్టర్ బైడెన్… చెప్పు తెగుద్ది ఎదవ” అని ఘాటుగా స్పందించారు నిఖిల్. ఈ ట్వీట్ కి మిగిలిన నెటిజన్లు కూడా నిఖిల్ కి సపోర్ట్ ఇస్తున్నారు.