Home News BIG BREAKING: హీరో సాయి ధరమ్ తేజ్ కి ఆక్సిడెంట్.?

BIG BREAKING: హీరో సాయి ధరమ్ తేజ్ కి ఆక్సిడెంట్.?

by Megha Varna

హీరో సాయి ధరమ్ తేజ్ కి బైక్ ఆక్సిడెంట్ జరిగింది. మాదాపూర్ లోని మెడికవర్ హాస్పిటల్ లో చికిత్సపొందుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి మీద తన స్పోర్ట్స్ బైక్ పై వెళ్తుంటే ఈ ఆక్సిడెంట్ జరిగింది అంట. కేబుల్ బ్రిడ్జి నుండి ఐకియా జంక్షన్ కి వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్పోర్ట్స్ బైక్ పై నుండి కింద పడిపోయారు. దీంతో ఆయన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లారు అంట. సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని  ప్రార్థిద్దాము..

UPDATE:

సాయి ధరమ్ తేజ్ హెల్మెట్ పెట్టుకొని ఉన్నారు అంట. ప్రస్తుతం చికిత్స తర్వాత స్పృహలోకి వచ్చారు అంట. అవుట్ అఫ్ డేంజర్.

You may also like