ప్రముఖ కమెడియన్ సునీల్ అస్వస్థతకు గురైనట్టు సమాచారం. గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సునీల్‌ను మాదాపూర్‌లోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది.మొన్నటి వరకు కూడా ఆరోగ్యంగానే ఉన్న ఈయన స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడని తెలుస్తుంది. కుటుంబ సభ్యులు వెంటనే మాదాపూర్‌లోని ఏ.ఐ.జి ఆసుపత్రిలో చేర్పించారు.

Video Advertisement

కొన్ని రోజులుగా ఈయన గొంతు, లివర్ సమస్యతో బాధ పడుతున్నాడు.ఆయన హాస్పిటల్ లో ఉన్నారు అనే వార్త రావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఈ వార్తపై సునీల్ స్పందించారు. తాను “ఆరోగ్యంగానే ఉన్నానని పేర్కొన్నారు.

సైనస్‌, ఇన్ఫెక్షన్‌ కారణంగా వైద్యుల సూచనతో ఆస్పత్రిలో చేరాను” అనివెల్లడించారు. సునీల్‌ తాజాగా నటించిన రవితేజ సినిమా ‘డిస్కో రాజా’ రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే. రాత్రి నుండి వైద్యం అందించడంతో సునీల్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని ప్రమాదం ఏమీ లేనట్లు తెలస్తోంది.