Ads
ప్రతీ ఫోటో ఒక జ్ఞాపకం.ఎప్పుడో తీసుకున్న ఫోటోలను ఇప్పుడు చూస్తే ఆ ఫోటో తళుకు జ్ఞాపకాలు అన్ని కళ్ళ ముందర మెదులుతుంటాయి.అందుకే ప్రతీ ఒక్కరు చిన్నప్పుడు నుండి ఇప్పటిదాకా తీసుకున్న అన్ని ఫోటోలను భద్రపరుచుకుంటూ ఉంటారు.అయితే సెలెబ్రెటీ లకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల అయితే వెంటనే వైరల్ అయ్యి అంతటా సదరు ఫోటోల గురించి చర్చలు మొదలవుతాయి.అయితే ఇటీవల తమిళ సూపర్ స్టార్ సూర్య మరియు అతని సోదరుడు కార్తీ చిన్నప్పటి ఫోటోలు నెట్ లో విడుదల అయ్యాయి.కాగా ఈ ఫోటోలు అంతటా హాట్ టాపిక్ గా మారాయి..ఆ వివరాల్లోకి వెళ్తే ..
Video Advertisement
ఏదైనా కుటంబంలో ఒక హీరో ఉంటారు.కానీ సూర్య కుటంబంలో అన్నదమ్ములు ఇద్దరు హీరోలే.కాగా సూర్య,కార్తీ ఇద్దరు కూడా అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనే విజయవంతమైన చిత్రాలను తమ ఖాతాలో వేసుకొని స్టార్ హీరో లుగా కొనసాగుతున్నారు.అయితే సూర్య ,కార్తీ వారి అమ్మ నాన్న లతో కలిసి వారి చిన్నతనంలో దిగిన ఫోటో ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది .అయితే సూర్య ,కార్తీ చాలా క్యూట్ గా ఉన్నారంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.ఆ ఫోటో లో సూర్య సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తుంటే కార్తీ మాత్రం మరి అమాయకంగా ఉన్నట్లు కనిపిస్తున్నారని మరికొంతమంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
హీరో సూర్య ఇప్పటికే అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనే పలు విజయవంతమైన చిత్రాలలో నటించారు.కాగా బాల దర్శకత్వం వహించిన “శివపుత్రుడు”,గౌతమ్ మీనన్ దర్శత్వం వహించిన “సూర్య సన్ అఫ్ కృష్ణన్” చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తిండిపోతారు సూర్య.అయితే నాగార్జున తో కలిసి నటించిన ” ఊపిరి” ,”నా పేరు శివ”చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు హీరో కార్తీ.
End of Article