Ads
హీరో, హీరోయిన్ల కాంబినేషన్ అనేది సినిమాకి చాలా ముఖ్యమైన విషయం. అందుకే దర్శకనిర్మాతలు కూడా హీరో, హీరోయిన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలా మన హీరోలు ఎంతో మంది హీరోయిన్స్ తో ఒకటికంటే ఎక్కువ సార్లు నటించారు. ఇదే విధంగా ఒక హీరో ఒక నటితో 130 సినిమాల్లో నటించారు.
Video Advertisement
ఆయనే నటుడు ప్రేమ్ నజీర్. ప్రేమ్ నజీర్ ఒక మలయాళ నటుడు. ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోషించి మలయాళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
అయితే, ప్రేమ్ నజీర్ ఒక అరుదైన రికార్డ్ సృష్టించారు. షీలా అనే నటితో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 130 సినిమాల్లో నటించారు. ఇది మాత్రమే కాదు మరొక రికార్డ్ కూడా సాధించారు. 520 సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించారు. ఈ రెండు అరుదైన ఘనతలకిగాను ప్రేమ్ నజీర్ రెండు సార్లు గిన్నీస్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఇవి మాత్రమే కాకుండా, 80 మంది హీరోయిన్లతో నటించారు. అలాగే ప్రేమ్ నజీర్ నటించిన 30 సినిమాలు అన్నీ ఒకటే సంవత్సరంలో విడుదల అయ్యాయి. ఇలా మరో రెండు రికార్డ్ లని కూడా ప్రేమ్ నజీర్ సొంతం చేసుకున్నారు.
End of Article