“పెళ్లయిందని ఒక నిర్మాత ఇలా అన్నారు..!” అంటూ… నటి “అర్చన శాస్త్రి” కామెంట్స్..!

“పెళ్లయిందని ఒక నిర్మాత ఇలా అన్నారు..!” అంటూ… నటి “అర్చన శాస్త్రి” కామెంట్స్..!

by Mohana Priya

Ads

టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ హీరోలకు హీరోయిన్లకు కేటాయించే రెమ్యూనరేషన్ లో చూపించే వివక్షతపై ఘాటుగా స్పందించారు నటి అర్చన. తపన అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన అర్చన, నేను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, సామాన్యుడు మొదలైన చిత్రాల ద్వారా నటిగా మంచి గుర్తింపు పొందారు.

Video Advertisement

తదుపరి సినిమాల్లో ఛాన్సులు తగ్గడం వల్ల మరియు సరైన అవకాశాలు రాకపోవడం వల్ల ఆమె కెరీర్ సవ్యంగా సాగలేదు. తమిళ్, మలయాళం, కన్నడ లాంటి భాషల్లో నటించిన అక్కడ కూడా ఆమెకు మంచి అవకాశాలు దక్కలేదు.

కొంతకాలం ఇండస్ట్రీ నుంచి కనుమరుగైన ఆమె తిరిగి బిగ్బాస్ సీజన్ వన్ పుణ్యమా అని ప్రేక్షకుల ముందుకు రాగలిగారు. ఇటీవల పెళ్లి చేసుకుని స్థిరపడి తిరిగి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నా అర్చన ఇండస్ట్రీలో జరుగుతున్న మేల్ డామినేషన్ పై తీవ్రంగా స్పందించారు.మిగతా అన్ని ఇండస్ట్రీస్ లో హీరోలతో పాటు హీరోయిన్లకు కూడా సమానమైన గుర్తింపు ఉంటుంది.

కానీ మన తెలుగు ఇండస్ట్రీలో మాత్రం పెళ్లయిన తర్వాత హీరోయిన్లు తిరిగి యాక్ట్ చేయడానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి….. పెళ్లయిన హీరోయిన్ లను రెమ్యూనరేషన్ తగ్గించుకోమంటారు…. మరి అదే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న హీరోలకు అదే మాట చెప్పగలరా…. ఎందుకు అంత విపక్షత చూపుతున్నారు అని ఆమె బాధను వ్యక్తం చేశారు.ఫ్యూచర్లో అయినా తెలుగు ఇండస్ట్రీ లో ఇలాంటి భేదాలు లేకుండా ఉండాలి అని ఆశిస్తున్నట్లు తెలిపారు.


End of Article

You may also like