Home Filmy Adda మిరపకాయ్ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.? ఇప్పుడు ఎక్కడుందంటారు?

మిరపకాయ్ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.? ఇప్పుడు ఎక్కడుందంటారు?

by Sainath Gopi

2011లో హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా, రీచా గంగోపాధ్యాయ, దీక్షాసేత్ హీరోయిన్లుగా నటించిన సినిమా మిరపకాయ్. అప్పట్లో ఈ సినిమా మంచి హిట్ ని సాధించింది. పాటలన్నీ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. పోలీస్ పాత్రలో నటించిన రవితేజ తన ఎనర్జీతో సినిమాకి ఒక ఊపు తీసుకువచ్చాడు. ఆ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు డైరెక్టర్ తో పాటు జూనియర్ ఆర్టిస్టులకు కూడా మంచి నేము, ఫేము రావడం గమనార్హం.

heroine friend in mirapakay

ఇప్పుడు ఆ సినిమాలో నటించిన ఒక జూనియర్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఆమె పేరు స్నిగ్ధ. రవితేజ లెక్చరర్ గా కాలేజీలో అడుగుపెట్టినప్పుడు కాలేజీ సన్నివేశాలలో రీచా గంగోపాధ్యాయ కి స్నేహితురాలుగా నటించింది స్నిగ్ధ. ఈమె సినిమాలో కనిపించింది తక్కువే అయినా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. చూడటానికి చక్కగా ఉంటుంది అలాగే ఈమె సోప్రానో మేల్ వాయిస్ కి అందరూ ఫ్లాట్ అయిపోయారు.

heroine friend in mirapakay

విచిత్రమైన వాయిస్ కల్చర్ ఆమెకు మంచి గుర్తింపుని తీసుకువచ్చింది. మెంటల్ కృష్ణ, ఆనంద్ సినిమాల నటి సత్య కృష్ణన్ గొంతులా ఉందంటూ అందరూ కామెంట్ చేశారు. అయితే ఆమెలా కెరియర్ లో రాంగ్ సెలక్షన్ చేసుకొని కెరియర్ ని కోల్పోకూడదని ఆమెకి అప్పట్లో చాలా మంది సలహాలు కూడా ఇచ్చారు. స్నిగ్ధకి హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ ఇద్దరూ మంచి సపోర్టుని ఇచ్చారని, ఇతర దర్శకులకి కూడా ఈమెని సిఫార్సు చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

heroine friend in mirapakay

అయితే ఆమె ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో కూడా ఆమె కనిపించకపోవడంతో ఏమైపోయిందనే ఒక అనుమానం అందరిలోనూ తలెత్తింది. అయితే ఆమె సినిమాలకి దూరమైందని తప్పితే ఆమె గురించిన ఇతర వివరాలేవి బయటికి తెలియక పోవడం గమనార్హం. మిరపకాయయ్ సినిమాలో ఈమె యాక్టింగ్ చూసిన ప్రతి ఒక్కరూ ఈమెకి ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఉంటుంది అనుకున్నారు కానీ ఇలా పూర్తిగా సినిమాలకే దూరమైపోతుందని ఎవరూ ఊహించి ఉండరు .

You may also like