Ads
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా అప్పట్లో ఓ మెరుపు మెరిపించారు గౌతమి. ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మందిని ఫిదా చేసేసారు గౌతమి. కేవలం టాలీవుడ్ లోనే కాక కోలీవుడ్ లో కూడా ఈ అందాల తార స్టార్ హీరోల సరసన నటించారు. ఈమెకి ఓ కూతురు వుంది. తానే సుబ్బలక్ష్మి.
Video Advertisement
ప్రస్తుతం ఈమె హాట్ టాపిక్ అయ్యి పోయింది. తన అందమైన ఫొటోలను సోషల్ మీడియా లో ఈ మధ్య షేర్ చేస్తూనే వున్నారు. ఈమె ఎంతో అందంగా ఫొటోల్లో కనపడుతున్నారు.
అవి ఇప్పుడు విపరీతంగా షికార్లు కొడుతున్నాయి. తల్లి లానే సుబ్బలక్ష్మి కూడా ఎంతో అందంగా వున్నారు. నెటిజన్లు ఈమె కూడా చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సుబ్బ లక్ష్మి ఇప్పుడు సినిమాల్లోకి రావచ్చు అని చాలా మంది అభిప్రాయం పడుతున్నారు. మరి ఆమె నిజంగా వస్తారా లేదా అనేది చూడాలి.
ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మందిని ఫిదా చేసిన గౌతమి పల్లెటూరి మొగుడు, సంకల్పం, శ్రీనివాస కల్యాణం, బామ్మ మాట బంగారు బాట వంటి చిత్రాల్లో నటించి ఎంతో మంచి పేరును పొందారు. ఈమె వైవాహిక జీవితం గురించి చూస్తే.. ఈ తారకి సందీప్ భాటియా తో 1998లో వివాహం అయ్యింది. వీరికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు సుబ్బలక్ష్మి.
కానీ దురదృష్టవుశాత్తు ఆమె ఎక్కువ కాలం సందీప్ భాటియా తో వుండ లేదు. మనస్పర్థల కారణంగా వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు. ఇది ఇలా ఉంటే కొన్నేళ్లు హీరో కమల్ హాసన్ తో గౌతమి సహజీవనం చేసింది. కూతురు సుబ్బలక్ష్మి తో పాటుగా వీళ్లిద్దరు కలిసి వున్నారు. పదేళ్ల పాటు వీరు కలిసి వున్నారు కానీ ఆ తరవాత వీళ్ళు విడిపోయారు. ఈమె అప్పట్లో మనమంతా తదితర సినిమాల్లో సపోర్టివ్ రోల్స్ చేసారు. సామాజిక సేవ, రాజకీయ కార్యక్రమాల్లో కూడా ఈమె పాల్గొనే వారు.
End of Article