బాలకృష్ణ నే రిజెక్ట్ చేసిన హీరోయిన్.. ఎవరా డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ? చివరికి సినిమా డిసాస్టర్.!

బాలకృష్ణ నే రిజెక్ట్ చేసిన హీరోయిన్.. ఎవరా డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ? చివరికి సినిమా డిసాస్టర్.!

by Harika

Ads

60 ఏళ్ల వయసు దాటినప్పటికీ కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్న సీనియర్ నటుడు బాలకృష్ణ. ఇండస్ట్రీ హిట్లు కొడుతూ ఇప్పటికీ మంచి ఊపు మీద ఉన్నారు. ఈయన సినిమాలకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఒక్కసారి బాలయ్య సినిమా వస్తుందని టాక్ వినిపిస్తే చాలు ఆ తర్వాత వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అభిమానులు.

Video Advertisement

అలాగే హీరోయిన్స్ సైతం ఆయన పక్కన నటించాలని స్టార్ డం ని సొంతం చేసుకోవాలని కలలు కంటూ ఉంటారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం బాలయ్య సినిమాలో ఛాన్స్ వస్తే చేయను అంటూ చెప్పిందంట ఇంతకీ ఆమె ఎవరు.. ఆమె రిజెక్ట్ చేసిన సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం. గతంలో బాలయ్య బాబు హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన కృష్ణ బాబు సినిమాలో హీరోయిన్ గా మొదట సాక్షి శివానంద్ ని తీసుకోవాలి అనుకున్నారట. అందుకోసం ఆమెను సంప్రదిస్తే సింపుల్ గా రిజెక్ట్ చేసింది ఈ అమ్మడు.

ఆ తర్వాత ఈ ఆఫర్ రాశిని వరించింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ ని సొంతం చేసుకుంది. ఆమె ఎందుకు రిజెక్ట్ చేసింది అనే విషయాన్ని పక్కన పెడితే సాక్షి శివానంద్ ఒక డిజాస్టర్ నుంచి తప్పించుకుందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బాబి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఒకటి చేస్తున్నారు. ఎన్.బి.కె 109 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా నిర్మాణం జరుగుతుంది.

ఈ సినిమా తరువాత బాలయ్య బోయపాటి శ్రీను సినిమా అఖండ టు సెట్స్ మీద కి వెళ్తున్నట్లు సమాచారం. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య ని ఢీ కొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే కధ విని ఇంప్రెస్ అయిన సంజు ఈ మూవీలో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.


End of Article

You may also like