Home Filmy Adda ఈ ఇద్దరు స్టార్ హీరోలని అంతలా ఇబ్బంది పెట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఈ ఇద్దరు స్టార్ హీరోలని అంతలా ఇబ్బంది పెట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా.?

by Mohana Priya

సాధారణంగా సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ అంటే సినిమా బృందమంతా హాజరవుతుంది. అందులోనూ ముఖ్యంగా హీరో హీరోయిన్లు అయితే సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ లో కచ్చితంగా పాల్గొంటారు. కానీ ఒక్క నటి మాత్రం ఇందుకు మినహాయింపు. ఆ హీరోయిన్ ఎవరో ఈ పాటికి మీలో చాలా మందికి అర్థం అయిపోయి ఉంటుంది. ఆ నటి మరెవరో కాదు నయనతార. నయనతార ఎన్నో సంవత్సరాల నుండి తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో వరుసగా సినిమాలు చేస్తున్నారు.heroine who caused trouble to these star heroes

అంతకుముందు సినిమా ప్రమోషన్స్ కి నయనతార హాజరయ్యేవారు. కానీ గత కొన్ని సంవత్సరాల నుండి సినిమా ప్రమోషన్స్ కి సంబంధించిన ఎటువంటి ఇంటర్వ్యూలకు కానీ, ఈవెంట్స్ కి కానీ నయనతార హాజరు అవ్వట్లేదు. సినిమా సైన్ చేసే ముందే నయనతార దర్శకనిర్మాతలకి తాను సినిమాకి సంబంధించిన ఎటువంటి ఈవెంట్స్ కి హాజరు అవ్వను అని చెప్తారట. అయితే నయనతార వల్ల ఇద్దరు తెలుగు స్టార్ హీరోలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు వార్తలు వచ్చాయి.heroine who caused trouble to these star heroes

అందులో ఒకరు విక్టరీ వెంకటేష్. వెంకటేష్, నయనతార కలిసి లక్ష్మీ, తులసి, బాబు బంగారం సినిమాల్లో నటించారు. బాబు బంగారం సినిమా షూటింగ్ సమయంలో నయనతార షూటింగ్ కి టైంకి రాకపోవడం వంటి అంశాలు వెంకటేష్ కి, అలాగే సినిమా బృందానికి చాలా ఇబ్బంది కలిగించాయట. దాని వల్ల సినిమా షూటింగ్ ఇంకా ఆలస్యం అయింది. ఇంక రెండవ హీరో మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి, నయనతార కలిసి సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించారు.heroine who caused trouble to these star heroes

ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అయ్యింది.  అంత పెద్ద సినిమా అవ్వడంతో సినిమాలో చిన్న పాత్ర పోషించిన నటుల నుండి, పెద్ద పాత్ర పోషించిన నటుల వరకు అందరూ ఏదో ఒక ప్రమోషనల్ ఈవెంట్ కి హాజరు అయ్యారు. కానీ నయనతార మాత్రం ఒక్క ఈవెంట్ లో కూడా కనిపించలేదు. “ఇంత పెద్ద సినిమా ప్రమోషన్ సమయంలో లీడ్ హీరోయిన్ లేకపోవడం ఏంటి?” అని అప్పట్లో చాలా కామెంట్స్ వచ్చాయి. అలా ఈ ఇద్దరు హీరోలు నయనతార వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు అట.

You may also like