ఈ 4 హీరోయిన్లను తెలుగు తెరకు “సీతారామమ్” డైరెక్టర్ పరిచయం చేసారని తెలుసా.?

ఈ 4 హీరోయిన్లను తెలుగు తెరకు “సీతారామమ్” డైరెక్టర్ పరిచయం చేసారని తెలుసా.?

by Mohana Priya

Ads

కేవలం డైరెక్టర్ గా కాకుండా, స్క్రీన్ రైటర్ గా కూడా పని చేస్తారు హను రాఘవపూడి. ఇప్పటి వరకూ ఆయన తీసిన సినిమాలు అన్నీ ప్రేక్షకులకు ఎంతో నచ్చాయి. ఆయన తెరకెక్కించే సినిమాల్లో కచ్చితంగా ఒక కొత్త నటిని పరిచయం చెయ్యడం ఆయన ప్రత్యేకత. అయితే ఇప్పుడు ఎటు చూసినా అందరి నోటా వినిపిస్తున్న సినిమా సీతా రామమ్.

Video Advertisement

మరీ ముఖ్యంగా అందులోని హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఎక్కడ నుండి వచ్చింది అమ్మాయి. భలేగా ఉందే ఈ హీరోయిన్ అనుకుంటున్నారు. ఇలా తను ఒక్కదాన్నే కాదు.. మరెంత మందినో పరిచయం చేశారు డైరెక్టర్ హను రాఘవపూడి.అందులోని కొందరు లిస్ట్ ఇదే.

1. లావణ్య త్రిపాటి

2012 లో విడుదల అయిన అందాల రాక్షసి మూవీకి హను రాఘవపూడి దర్శకత్వం వహించగా… సినిమా మంచి ఆధరణ పొందింది. ఈ సినిమాతోనే లావణ్య త్రిపాటిని తొలిసారి ఇండస్ట్రీ ముందుకు తీసుకు వచ్చాడు హను రాఘవపూడి. ఇక ఈ సినిమా తర్వాత లావణ్యకి వెనక్కి తిరిగి చూసే పని లేకపోయింది. వరుస సినిమాలతో, స్టార్ట్ హీరోల సరసన బిజీ అయిపోయింది.

2. మేఘా ఆకాశ్

2017 లో తీసిన లై సినిమాతో ముద్దుగుమ్మ మేఘా ఆకాశ్ ను హను రాఘవపూడి పరిచయం చేశారు. మంచి హిట్ అందుకున్న ఈ సినిమా తర్వాత, మేఘాకి మంచి ఆఫర్స్ వచ్చాయి. దీంతో కేవలం తెలుగులోనే కాకుండా, తమిళంలో కూడా సినిమాలు చేస్తూ.. చేతిలో ఇప్పుడు 9 సినిమాలతో కాలీ లేకుండా ఫుల్ బిజీ అయ్యింది మేఘా ఆకాశ్.

3. మెహ్రీన్

2017 లో విడుదల అయిన లై సినిమా తర్వాత, ఆ సంవత్సరంలోనే, కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతోనే నటి మెహ్రీన్ ను తొలిసారి పరిచయం చేశారు. కృష్ణగాడి వీర ప్రేమ గాథ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా… మెహ్రీన్ కి కూడా మంచి మంచి అవకాశాలు వచ్చాయి. ఈ లెక్కన ఒకే ఏడాదిలో ఇద్దరు కొత్త హీరోయిన్లను పరిచయం చేశారు హను రాఘవపూడి.

4. మృణాల్ ఠాకూర్

2020లో సందడి అంతా మృణాల్ ఠాకూర్ దే. గతంలో సీరియల్స్ లో నటించిన మృణాల్ ఠాకూర్, ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమకి సీతా రామమ్ తోనే తొలి పరిచయం. ఇక ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి హిట్ సాధించింది. దీంతో ప్రతీ ఒక్కరూ ఎవరీ మృణాల్ ఠాకూర్ అంటూ , తన గురించి తెలుసుకోవడానికి ఆరాట పడుతున్నారు.

sita ramam movie review

ఇలా హను రాఘవపూడి పరిచయం చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి మంచి అవాశాలు వచ్చి… చాలా బిజీగా అయ్యారు. ఇప్పుడు ఇక మృణాల్ ఠాకూర్ వంతు. మరి ముందు ముందు ఈ ముద్దుగుమ్మ మరెన్ని సినిమాలు చేస్తుందో వేచి చూడాల్సిందే.


End of Article

You may also like