సాధారణంగా హీరోలతో పోలిస్తే హీరోయిన్లకి సినిమాల్లో హీరోయిన్‌గా నటించే కాలం తక్కువగా ఉంటుంది అని అంటారు. చాలా వరకు అది నిజమే. అప్పట్లో హీరోలుగా నటించిన ఎంతో మంది హీరోలు ఇప్పటికి కూడా హీరోలుగా నటిస్తున్నారు. కానీ అప్పుడు హీరోయిన్లుగా నటించిన చాలా మంది హీరోయిన్లు మాత్రం ఇప్పుడు సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Video Advertisement

అప్పట్లో హీరోయిన్లుగా నటించి, ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న చాలా మంది, తర్వాత కొంత కాలానికి సినిమా ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయారు. మళ్లీ తర్వాత కంబ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు కూడా కొంత మంది అప్పటి హీరోయిన్లు మళ్లీ సినిమాల్లో నటించబోతున్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 సోనాలి బింద్రే

చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత సోనాలి బింద్రే మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

actresses re entry into tollywood

#2 మీరా జాస్మిన్

రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమాలో మీరా జాస్మిన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.

yesteryear heroines who are making comeback into movies

#3 సదా

సదా కూడా మధ్యలో చాలా కాలం సినిమాల నుండి దూరంగా ఉన్నారు. మళ్లీ సదా ప్రస్తుతం సినిమాల్లోకి రావాలని ఆలోచిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

actresses re entry into tollywood

#4 అన్షు

మన్మధుడు, రాఘవేంద్ర సినిమాల్లో నటించిన అన్షు కూడా మళ్లీ తెలుగు సినిమాల్లో నటించాలని అనుకుంటున్నారు.

#5 భావన

మలయాళ నటి భావన తెలుగులో ఒంటరి, హీరో వంటి సినిమాల్లో నటించారు. మళ్లీ భావన తెలుగులో నటించాలి అని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.

actresses re entry into tollywood

#6 జెనీలియా

జెనీలియా కూడా ప్రస్తుతం ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నారు.

yesteryear heroines who are making comeback into movies

#7 కలర్స్ స్వాతి

చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కలర్స్ స్వాతి పంచతంత్రం అనే సినిమాలో నటిస్తున్నారు.

#8 లయ

లయ కూడా మళ్లీ తెలుగు సినిమాల్లో నటించాలి అని అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా లయ చాలా యాక్టివ్ గా ఉంటారు.

#9 నిఖిత

హాయ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయం అయిన నిఖిత కూడా తర్వాత చాలా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారు.

actresses re entry into tollywood

వీరు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది హీరోయిన్లు ఇటీవలి కాలంలో ముఖ్య పాత్రల్లో రీ-ఎంట్రీ ఇచ్చారు.

ALSO READ : ఒకే లాగ కనిపించే 13 మంది హీరోయిన్స్.! లిస్ట్ లో ఎవరెవరున్నారో చూడండి.!