సెలెబ్రిటీల జీవితం తెరిచిన పుస్తకం లాంటిది అని అంటారు. వాళ్ళు మనకి వ్యక్తిగతంగా తెలియదు. వారికి మనం అందరం అంత పర్సనల్ గా తెలియదు. కానీ వాళ్ళ విషయాలు అన్ని మనకి తెలుస్తాయి. అందరూ సెలబ్రిటీలు వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా మాట్లాడరు. అయినా సరే వాళ్ళ విషయాలు స్ప్రెడ్ అవుతాయి. అందులో పెళ్లి కూడా ఒకటి.

heroines who divorced and never married

వ్యక్తిగత కారణాల వల్ల కొంత మంది మ్యారేజ్ లైఫ్ అనుకున్న విధంగా సాగలేదు. దాంతో సపరేట్ అయ్యారు. తర్వాత కొంత కాలానికి మళ్లీ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించారు. వాళ్ళలో కొంత మంది హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 భానుప్రియ

ఒకప్పటి స్టార్ హీరోయిన్ భానుప్రియ గారు, 1998 లో ఆదర్శ్ కౌశల్ ని వివాహం చేసుకున్నారు. 2003 లో వీరికి అభినయ పుట్టారు. 2005 లో వీళ్లిద్దరు విడిపోయారు. 2018 లో ఆదర్శ్ కౌశల్ మరణించారు.

heroines who divorced and never married

#2 అమలా పాల్

2014 లో అమలా పాల్, దర్శకుడు విజయ్ వివాహం చేసుకున్నారు. 2017 లో వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరు విడిపోయారు. కొంతకాలం క్రితం అమలా పాల్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు అని కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఈ విషయంపై అమలా పాల్ అస్సలు స్పందించలేదు. కాబట్టి ఈ వార్త ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు.

heroines who divorced and never married

#3 కరిష్మా కపూర్

బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ 2003 లో సంజయ్ కపూర్ ని పెళ్లి చేసుకున్నారు. 2016 లో వీళ్ళిద్దరూ విడిపోయారు.

heroines who divorced and never married

#4 రజని

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రజని 1998 లో డాక్టర్ ముళ్ళగిరి ప్రవీణ్ ని వివాహం చేసుకున్నారు. 2008 లో వీళ్ళిద్దరూ సపరేట్ అయ్యారు.

heroines who divorced and never married

#5 సారిక

శృతి హాసన్, అక్షర హాసన్ తల్లి అయిన నటి సారిక 1988 లో కమల్ హాసన్ ని వివాహం చేసుకున్నారు. 2004 లో వీళ్ళిద్దరూ విడిపోయారు.

heroines who divorced and never married

#6 రేవతి

నటి రేవతి, 1986 లో యాక్టర్ సురేష్ చంద్ర మీనన్ ని వివాహం చేసుకున్నారు. వీరికి మహి అనే ఒక పాప కూడా ఉంది. 2013 లో వీళ్లిద్దరు విడిపోయారు.

heroines who divorced and never married

#7 రమాప్రభ

రమాప్రభ గారు 1981 లో శరత్ బాబు గారిని పెళ్లి చేసుకున్నారు. 1988 లో వీళ్ళు సపరేట్ అయ్యారు.

heroines who divorced and never married