“శ్రియ శరన్” నుండి… “నయనతార” వరకు… 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న 9 హీరోయిన్స్..!

“శ్రియ శరన్” నుండి… “నయనతార” వరకు… 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న 9 హీరోయిన్స్..!

by kavitha

Ads

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ అంత తొందరగా పెళ్లికి చేసుకోవడానికి ఇష్టపడరు. కెరీర్ కు ప్రాధాన్యత ఇస్తూ దానిపైనే  ఫోకస్ చేస్తుంటారు. అలా నాలుగు పదుల వయసు దగ్గరకు వస్తున్నా కొంతమంది హీరోయిన్స్ వివాహానికి దూరంగానే ఉన్నారు.

Video Advertisement

అయితే ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్స్ కొందరు 30 ఏళ్లు దాటిన తరువాత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  వారిలో కొందరు పెళ్లి తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు. అయితే 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. నయనతార:

లేడీ సూపర్ స్టార్ గా పాపులర్ అయిన నయనతార దాదాపు 7 ఏళ్ళు  ప్రేమించుకున్న తరువాత 2022లో కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ ను వివాహం చేసుకున్నారు. పెళ్లి సమయానికి, నయనతార వయసు 37 సంవత్సరాలు. అదే ఏడాది సరోగసీ పద్ధతిలో నయనతార, విఘ్నేష్ దంపతులు కవలలకు తల్లిదండ్రులు అయ్యారు.
2. కాజల్ అగర్వాల్:
ఐదేళ్లకు పైగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. 2020లో కాజల్ గౌతమ్ కిచ్లు అనే ముంబైకి చెందిన బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో కాజల్ వయసు 35 సంవత్సరాలు. గౌతమ్, కాజల్ జంటకు 2021లో బాబు జన్మించాడు.
3 . హన్సిక మోత్వాని:

ప్రముఖ హీరోయిన్ హన్సిక మోత్వానీ తన బిజినెస్ పార్టనర్ మరియు బాయ్‌ఫ్రెండ్ అయిన సోహైల్ ఖతురియాను  పెళ్లి చేసుకున్నారు. వివాహ సమయంలో హన్సిక వయస్సు 31 సంవత్సరాలు.
4 . శ్రియా శరన్:

టాలీవుడ్ హీరోయిన్ శ్రియా శరణ్ 2018లో రష్యన్ టెన్నిస్ ప్లేయర్ ఆండ్రీ కొస్చీవ్‌ ను పెళ్లి చేసుకున్నారు. ఆమె పెళ్లి సమయానికి శ్రియా వయసు 36 సంవత్సరాలు. ఈ జంటకు 2020లో పాప జన్మించింది.
5. స్వాతి రెడ్డి:

ప్రముఖ తెలుగు నటి స్వాతి రెడ్డి వికాస్ వాసుని 2018లో వివాహం చేసుకున్నారు. పెళ్లి సమయంలో స్వాతి వయసు 31 సంవత్సరాలు.
6. నిక్కీ గల్రానీ:

ప్రముఖ తమిళ హీరోయిన్ నిక్కీ గల్రానీ, యాక్టర్ ఆది పినిశెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం 2022 లో  గ్రాండ్ గా జరిగింది. హీరోయిన్ నిక్కీ గల్రానీ వయసు పెళ్లి సమయంలో 30 సంవత్సరాలు.
7.  భాను శ్రీ మెహ్రా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం వరుడు. 2010లో వచ్చిన ఈ మూవీతో భాను శ్రీ మెహ్రా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. భాను శ్రీ మెహ్రా కరణ్ మానస్‌ ను వివాహం చేసుకుంది. పెళ్లి సమయంలో భాను శ్రీ వయస్సు 37 సంవత్సరాలు.
8. సమంత:

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రముఖ హీరో అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి, పెద్దలను ఒప్పించి 2017లో  పెళ్లి చేసుకుంది. పెళ్లి సమయంలో సమంత వయసు 30 సంవత్సరాలు. కానీ వీరిద్దరు వివాహం అయిన నాలుగు సంవత్సరాలకు తాము విడాకులు తీసుకుని విడిపోతున్నట్లుగా ప్రకటించారు.

Also Read: “సాయి ధరమ్ తేజ్” తో పాటు… సినిమాల్లో కొనసాగుతున్నప్పుడే “పేరు” మార్చుకున్న 12 యాక్టర్స్..!

 

 


End of Article

You may also like