Home Filmy Adda వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న 10 హీరోయిన్లు…ఎవరి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే?

వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న 10 హీరోయిన్లు…ఎవరి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే?

by Sainath Gopi

మన ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు కొంత మంది సినిమా రంగానికి చెందిన వారిని పెళ్లి చేసుకుంటే, కొంత మంది మాత్రం సినిమా రంగానికి అస్సలు సంబంధం లేని వారిని పెళ్లి చేసుకున్నారు. వారిలో కొంత మంది వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్నారు. అలా వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 శిల్పా శెట్టి – రాజ్ కుంద్రా

నటి శిల్పా శెట్టి వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రా ని వివాహం చేసుకున్నారు. వారికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు.

Actresses who married businessmen

#2 సోనమ్ కపూర్ – ఆనంద్ అహుజా

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ కూడా ఆనంద్ అహుజా అనే ఒక వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్నారు.

Actresses who married businessmen

#3 ఈషా డియోల్ – భరత్ తక్తాని

ఈషా డియోల్ కూడా వజ్రాల వ్యాపారి అయిన భరత్ తక్తాని ని పెళ్లి చేసుకున్నారు.

Actresses who married businessmen

#4 ప్రియమణి – ముస్తఫా రాజ్

టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి కి 2017 లో ముస్తఫా తో వివాహం అయ్యింది. ప్రియమణి టివి షోలతో బుల్లితెరను ఏలుతున్నారు. ఇటీవలే భామాకలాపంతో కూడా మెప్పించారు. ప్రముఖ బిజినెస్ మాన్ అయిన ముస్తఫా రాజ్ ని పెళ్లి చేసుకుంది ప్రియమణి.

priyamani-husband

#5 పూర్ణ – షానిద్ ఆసిఫ్ అలీ 

‘శ్రీ మహాలక్ష్మీ’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పూర్ణ తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అవును మరియు దాని సీక్వెల్ అయిన అవును 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గర అయింది. అదేవిధంగా ‘అదుగో’,‘సీమటపాకాయ్’,‘రాజుగారి గది’, ‘మామ మంచు అల్లుడు కంచు’,‘సిల్లీ ఫెలోస్’ లాంటి ఎన్నో చిత్రాలలో ప్రాముఖ్యత ఉన్న పాత్రను పోషించింది.ముంబై కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీ  ని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది పూర్ణ.

poorna 2

తెలుగు సినిమాల్లో తనదైన నటనతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న పూర్ణ.. చాలా కాలంగా బుల్లితెరపైనా సందడి చేస్తోంది. ఇప్పటికే వేరే భాషల్లో పలు షోలలో పని చేసిన ఈ అమ్మడు.. తెలుగులో ‘ఢీ’ షోకు జడ్జ్‌గా చేసింది. దాదాపు మూడు సీజన్లుగా ఇందులో కనిపిస్తోన్న ఆమె.. ఆ తర్వాత జబర్ధస్త్, శ్రీదేవి డ్రామ కంపెనీ, కామెడీ స్టార్స్ వంటి షోలు చేసింది.

#6 అసిన్ – రాహుల్ శర్మ

ఎన్నో తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన అసిన్ కూడా మైక్రోమాక్స్ సంస్థ సీఈవో అయిన రాహుల్ శర్మ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Actresses who married businessmen

#7 రీమా సేన్ – శివ్ కరణ్ సింగ్

చిత్రం, మనసంతా నువ్వే తో పాటు ఇంకా ఎన్నో సినిమాల్లో నటించిన రీమా సేన్ కూడా రెస్టారెంట్స్ ఓనర్ అయిన శివ్ కరణ్ సింగ్ ని పెళ్లి చేసుకున్నారు.

Actresses who married businessmen

#8 హన్సిక – సోహెల్

దేశముదురు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ హన్సిక….ఆ సినిమా తర్వాత తెలుగు మంచి క్రేజ్ తెచ్చుకుంది.వరుసపెట్టి సినిమాలు చేసింది. తర్వాత తమిళ్ లో బిజీ అయ్యి, తెలుగులో సినిమాలు తగ్గించింది. 2022 డిసెంబర్ లో సోహెల్ అనే బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుంది హన్సిక.

#9 కాజల్ అగర్వాల్ – గౌతమ్ కిచ్లు

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా 2020లో గౌతమ్ కిచ్లు ని వివాహం చేసుకున్నారు. గౌతమ్ కూడా ఒక వ్యాపారవేత్త. డిసెర్న్ లివింగ్ పేరుతో ఒక ఇంటీరియర్ డెకర్ సంస్థని నడుపుతున్నారు.

Actresses who married businessmen

#10. రకుల్ ప్రీత్ సింగ్ – జాకీ

బాలీవుడ్ ప్రొడ్యూసర్, నటుడు జాకీ భగ్నాని తో, రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ఘనంగా జరిగింది. వీరిద్దరూ గత 3 సంవత్సరాల నుండి ప్రేమలో ఉన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ తన పుట్టినరోజు నాడు 2021 లో తన రిలేషన్ షిప్ గురించి ప్రకటించారు.

You may also like