HI NANNA COLLECTIONS: మిక్స్ డ్ టాక్ తో మొదలైన కూడా మంచి కలెక్షన్స్ సాధించిన హాయ్ నాన్న… !

HI NANNA COLLECTIONS: మిక్స్ డ్ టాక్ తో మొదలైన కూడా మంచి కలెక్షన్స్ సాధించిన హాయ్ నాన్న… !

by Mounika Singaluri

Ads

నాచురల్ స్టార్ నాని మృణాల్ ఠాకూర్ జంటగా వచ్చిన చిత్రం హాయ్ నాన్న. తాజగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు మిశ్రమ స్పందన సంపాదించుకుంది. అయితే ఉండగా ఉండగా మౌత్ టాకుతో ఈ మూవీ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ దిశగా ఈ మూవీ కొనసాగుతుంది.వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఫ‌స్ట్ వీకెండ్‌లో ఈ మూవీ న‌ల‌భై కోట్ల వ‌ర‌కు గ్రాస్ క‌లెక్ష‌న్స్‌, పంతొమ్మిది కోట్ల‌కుపైగా షేర్ వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం.

Video Advertisement

hi nanna movie review

ఏపీ, తెలంగాణ‌లో తొలిరోజు 2.90 కోట్లు వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ మూవీ, శ‌నివారం రోజు మాత్రం 4 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. ఆదివారం రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి 4.5 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్లు సినీ ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తోన్నాయి.ఓవ‌ర్‌సీస్‌లో ఈ సినిమా దుమ్మురేపుతోంది. ఫ‌స్ట్ వీకెండ్‌లోనే మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్‌లో చేరిపోయి రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యేసరికి నైజం లో ఈ మూవీ 14 కోట్ల గ్రాస్ సాధించింది.

హాయ్ నాన్న మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 27 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైంది. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. తండ్రి కూతుర్ల సెంటిమెంట్ తో వచ్చిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.


End of Article

You may also like