Ads
ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా రాధే శ్యామ్ గురించి అభిమానులు దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. భారతదేశం అంతటా కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Video Advertisement
రాధే శ్యామ్ ఓ వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఎంపిక చేయనున్నారు. అలా అని ఇది బయోపిక్ కాదు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన రాధే శ్యామ్ టీజర్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల ఆసక్తిని ఇంకా పెంచాయి.
అయితే జనవరిలో విడుదల అవ్వాల్సిన రాధే శ్యామ్ సినిమా వాయిదా పడి మార్చ్‌లో విడుదల అవ్వబోతోంది. దాంతో రాధే శ్యామ్ సినిమా బృందమంతా సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. సినిమా బృందం మరొక ట్రైలర్ విడుదల చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఈ ట్రైలర్ కి సంబంధించి ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. అందులో ప్రభాస్ ఒక షిప్ మీద పరిగెడుతూ ఉంటారు. ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఆ పోస్టర్ సరిగ్గా గమనిస్తే అందులో సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అవేంటంటే ప్రభాస్ పరిగెడుతూ ఉన్నప్పుడు చుట్టూ చూస్తే నీరు, నిప్పు, గాలి అన్నీ ఉంటాయి. అంటే సినిమాలో పంచభూతాలకి, ప్రేమకి మధ్య జరిగే కథ చుట్టూ సినిమా తిరుగుతుంది అని అంటున్నారు. సినిమా ట్రైలర్ లో కూడా అలాగే చూపించారు. దాంతో రెండవ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
End of Article