కోట్లు సంపాదిస్తున్న ఈ “బాడీగార్డ్” ల గురించి తెలుసా..? అందరికంటే ఎక్కువ సంపాదించే బాడీగార్డ్ ఎవరంటే..?

కోట్లు సంపాదిస్తున్న ఈ “బాడీగార్డ్” ల గురించి తెలుసా..? అందరికంటే ఎక్కువ సంపాదించే బాడీగార్డ్ ఎవరంటే..?

by kavitha

Ads

సినిమా సెలబ్రెటీలకు ఉండే క్రేజ్ గురుంచి తెలిసిందే. సినిమాలు, ఈవెంట్లు, ప్రకటనలతో బిజీగా ఉండే వారి డైరీల్లో ఖాళీ పేజీ ఉండదు. దానికి తగ్గట్టే వారి ఆదాయం భారీగా ఉంటుంది. అదే బాలీవుడ్ స్టార్ హీరోల విషయానికి వస్తే వారి  సంపాదన ఏడాదికి వందల కోట్లలో ఉంటుందని తెలిసిందే.

Video Advertisement

ఆ హీరోల సంపాదనకు అనుగుణంగా వారి మెయింటైన్సు అలాగే ఉంటుంది. మరి అలాంటి హీరోలకు సెక్యూరిటీ ఇచ్చే బాడీ గార్డులకు ఇచ్చే జీతాలు ఏ రేంజ్ లో ఉంటాయి. స్టార్ హీరోల బాడీగార్డ్ ల ఏడాది జీతం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.  మరి ఏ స్టార్ హీరో బాడీగార్డ్ అత్యధిక జీతం తీసుకుంటాడో ఇప్పుడు చూద్దాం..
స్టార్ హీరోలకు ప్రేక్షకులలో ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు. దాని వల్ల వారు బయటికి రావడం అంత సులభం కాదు. వారికి సెక్యూరిటీ ఉండాలి. అందులోనూ నమ్మకమైన బాడీ గార్డు కూడా ఉండాలి. రక్షణ కవచం వలె పని చేసే బాడీ గార్డులకు స్టార్ హీరోలు వారి రేంజ్‌లో జీతాలు ఇస్తున్నారు. వేలల్లో, లక్షల్లో కాదు. వారి ఏడాది జీతం కోటల్లో ఉందంటే ఆశ్చర్యపోక మానరు. వీరి జీతం చిన్న హీరోలలో కొందరి రెమ్యూనరేషన్ తో సమానం.
అందరి కన్నా ఎక్కువ జీతం తీసుకునే బాడీగార్డ్ రవి సింగ్‌. ఇతను బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ బాడీగార్డు. రవి సింగ్‌ నెల జీతం దాదాపు రూ.17 లక్షలు, అంటే సంవత్సరానికి రూ.2.7 కోట్ల పైనే సంపాదిస్తున్నాడు. అతని తరువాతి స్థానంలో ఉన్న బాడీగార్డు షేరా, సల్మాన్‌ ఖాన్‌ బాడీగార్డ్. షేరా సుమారు 29 సంవత్సరాలుగా సల్మాన్‌ ఖాన్ దగ్గరే బాడీ గార్డుగా ఉన్నాడు. షేరా నెల శాలరీ రూ.15 లక్షలు, అంటే ఏడాదికి రెండు కోట్ల అని తెలుస్తోంది.అక్షయ్‌ కుమార్‌ బాడీగార్డు శ్రేయ్‌సే థెస్లె సంవత్సరానికి రూ.1.2 కోట్ల జీతం అని తెలుస్తోంది. అమితాబ్‌ బచ్చన్‌ కు  బాడీగార్డుగా పనిచేసిన జితేంద్ర షిండే ఏడాదికి రూ.1.5 కోట్లు జీతం తీసుకున్నాడు. ఆరేళ్ల పాటు అమితాబ్‌ బాడీగార్డ్ పని చేసి 2021 ఆగస్టు తర్వాత మానేశాడు. ఆమిర్‌ ఖాన్‌ బాడీగార్డ్ యువరాజ్‌ ఘోర్పడేకి సంవత్సరానికి రెండు కోట్లు జీతం అని తెలుస్తోంది. దీపికా పదుకొణె బాడీగార్డ్ జలాల్‌ కి ఏడాదికి రూ.1.2 కోట్లు, అనుష్క శర్మ బాడీగార్డ్ ప్రకాశ్‌ సింగ్‌ ఏడాదికి రూ.1.2 కోట్లు జీతం తీసుకుంటునట్లు తెలుస్తోంది.

Also Read: BABY REVIEW : “ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్” నటించిన బేబీ హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like