Ads
కోటిన్నర విలువైన భూమిని హిందూ మహిళలు మసీదు కట్టడం కోసం ఇచ్చేసి పెద్ద మనసుని చాటుకున్నారు. పైగా అది చనిపోయిన తమ తండ్రి చివరి కోరిక. మరి ఇక దీని కోసం వివరాలని చూస్తే.. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉధమ్ సింగ్ నగర్ జిల్లా కాశీపూర్ పట్టణంలో ఇది జరిగింది.
Video Advertisement
20 ఏళ్ల కిందట తండ్రి మరణించినా ఆయన కోరికని వీళ్ళు తీర్చారు. కాశీపూర్ పట్టణానికి చెందిన రైతు లాలా బ్రజ్నందన్ ప్రసాద్ రస్తోగి తన భూమి లో కొంత భాగాన్ని మసీదుకు ఇవ్వాలనుకున్నాడు.
కానీ ఇది అవ్వకుండానే 2003 లో 80 ఏళ్ల వయసులో ఆయన చనిపోయారు. ఈ విషయాన్ని బ్రతికున్నప్పుడే బంధువులకి ఆయన చెప్పడంతో.. వాళ్ళ ద్వారా ప్రసాద్ కుమార్తెలు సరోజ్, అనితలకు ఈ మధ్యే తెలిసింది. సరోజ్, అనితలు తమ సోదరుడు రాకేశ్ రస్తోగికి ఈ విషయం చెప్పగా.. అంతా కలిసి నాలుగు ఎకరాల భూమిని మసీదుకు దానం చేయడానికి సిద్ధం అయ్యారు.
తమ వాటాగా వచ్చిన భూమిని మసీదుకు సరోజ్, అనితలు ఆదివారం ఇవ్వడం జరిగింది. ఆయన ఆఖరి కోరిక తీర్చడం మా బాధ్యత అన్నారు కూతుళ్లు. అలానే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది అని రాకేష్ అన్నారు. ఇద్దరు అక్కా చెల్లెళ్లు మత ఐక్యతకు ప్రత్యక్ష ఉదాహరణ అని కాశీపూర్ మసీదు కమిటీ చీఫ్ హసిన్ ఖాన్ అన్నారు.
లాలా బతికున్నప్పుడు ఏదైనా ముఖ్య కార్యక్రమాలకు ఆయన నుంచే తొలి విరాళం మేము పొందే వాళ్ళం అని హసిన్ చెప్పారు. లాలా ముస్లింలకు మసీదు వద్ద ముస్లీములకి పండ్లు, స్వీట్లు పంచిపెట్టేవారని కూడా అన్నారు. లాలా మరియు మా తండ్రి మహ్మద్ రజా ఖాన్ మంచి స్నేహితులని.. వారిది 50 ఏళ్ల అనుబంధమని చెప్పారు.
End of Article