Home serials బాబోయ్ ఈ సీరియల్ సీన్ మాములు ఓవర్ గా లేదుగా.? ఈ ఫన్నీ ఎడిట్ చూసి నవ్వుకోండి.!

బాబోయ్ ఈ సీరియల్ సీన్ మాములు ఓవర్ గా లేదుగా.? ఈ ఫన్నీ ఎడిట్ చూసి నవ్వుకోండి.!

by Mohana Priya

మన తెలుగు సీరియల్స్ కి చాలా క్రేజ్ ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే సీరియల్స్ కి ఎంత క్రేజ్ ఉంటుందో, సోషల్ మీడియాలో కూడా అంతే ట్రోలింగ్ ఉంటుంది. సీరియల్స్ లో జరిగే ఎన్నో విషయాలు రియల్ లైఫ్ కి చాలా దూరంగా ఉంటాయి. కొన్ని సీన్స్ అయితే చూస్తే “ఏంటిది ఇలా జరుగుతోంది?” అని చాలా మందికి అనిపిస్తుంది.

Hitler gari pellam serial scene going viral

అలా సీరియల్స్ లో వింతగా అనిపించిన సీన్స్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. అయితే కొంత కాలం క్రితం ఇలా ఒక సీరియల్ లో జరిగిన ఒక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జీ తెలుగులో కొన్ని నెలల క్రితం మొదలైన సీరియల్ హిట్లర్ గారి పెళ్ళాం. ఈ సీరియల్ లో నిరుపమ్ హీరోగా నటిస్తున్నారు.

Hitler gari pellam serial scene going viral

కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో ప్రేక్షకులు కూడా ఈ సీరియల్ ని ఎంతో బాగా ఆదరిస్తున్నారు. ప్రస్తుతం హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ జీ తెలుగు సీరియల్స్ లో టాప్ టెన్ సీరియల్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ సీరియల్ లో ఒక ఎపిసోడ్ లో కిడ్నాప్ కి గురైన హీరోయిన్ ఒక చోట ఇరుక్కుపోతే, హీరో తనని వెతుక్కుంటూ వెళ్తాడు. హీరోయిన్ హీరోయిన్ కార్డ్ బోర్డ్ బాక్స్ లో ఉన్నట్టు చూపించారు.

Hitler gari pellam serial scene going viral

హీరోయిన్ హీరోకి ఫోన్ లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఈ సీన్ మామూలుగా అయితే చాలా సీరియస్ గా నడిచే సీన్. కానీ ఇందులో మధ్యలో కొన్ని చోట్ల కామెడీ యాడ్ చేయడంతో ప్రేక్షకులకి ఈ సీన్ అంత ఇంపాక్ట్ ఫుల్ గా అనిపించలేదు. సీన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉండడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

watch video :

https://www.facebook.com/Funwalaa/videos/4030962900266512/

You may also like