హనీమూన్ కి వెళ్లిన యాంకర్…దోపిడీ జరగడంతో ఏం చేయాలో తెలియక?

హనీమూన్ కి వెళ్లిన యాంకర్…దోపిడీ జరగడంతో ఏం చేయాలో తెలియక?

by Megha Varna

Ads

దక్షణాది లో యాంకర్ గా ,హోస్ట్ గా,సింగర్ గా ముందుకు దూసుకుపోతున్న దివ్య ప్రేక్షకులందరికీ సుపరిచితులు.అయితే ఇప్పటికి దివ్య పేరు చెప్తే ప్రేక్షకులకి గుర్తుకు వచ్చేది మాత్రం సూపర్ సింగర్ కార్యక్రమమే.సూపర్ సింగర్ అంతగా దివ్య కు పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చింది.అయితే కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉంటున్న దివ్య తన ప్రోగ్రామ్స్ అన్నింటికీ కాస్త బ్రేక్ ఇచ్చి తన భర్త తో కలిసి ఫ్రాన్స్ కు వెళ్లారు .అయితే ఫ్రాన్స్ లో దివ్య కు సంబందించిన కొన్ని వస్తువులు చోరీ చెయ్యబడ్డాయి.ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

తన వైవాహిక జీవితాన్ని ఆనందించడానికి ఫ్రాన్స్ వెళ్లారు దివ్య మరియు అతని భర్త శిబు ధరకాన్.అయితే ఓ పక్కన లాప్ టాప్ బ్యాగ్ మరియు సూట్ కేస్ పెట్టారు దివ్య దంపతులు.అయితే అది క్షణం తిరిగేలోగా అవి మాయమయ్యాయి.దీంతో దివ్య దంపతులు వెంటనే ఫ్రాన్స్ పోలీసులను ఆశ్రయించారు.కానీ ఫ్రాన్స్ పోలీసులు సరిగ్గా ఈ విషయాన్నీ పట్టించుకోకపోవడంతో ఏంబసి ,లీగల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు దివ్య దంపతులు.

అయితే ఈ విషయం గురించి దివ్య తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో చెప్తూ …లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులు చోరీ అయ్యాయి .లాప్ టాప్ ,ఐఫోన్ ,ఐపాడ్ ,ఎంతో విలువైన దుస్తులు ,నా భర్త పాస్ పోర్ట్ ఇలా ఎన్నో విలువైన వస్తువులు పోయాయి అని తెలిపారు.


End of Article

You may also like