హాస్పిటల్ కి తీసుకెళ్లండి…ఊపిరి ఆడట్లేదు అని బతిమాలినా..! కంటతడి పెట్టించే ఘటన!

హాస్పిటల్ కి తీసుకెళ్లండి…ఊపిరి ఆడట్లేదు అని బతిమాలినా..! కంటతడి పెట్టించే ఘటన!

by Mohana Priya

Ads

అనుమానం పెనుభూతం అంటారు. మనం దేనికైనా భయపడుతూ ఉంటే ఆ భయం మనల్ని అన్ని రకాలుగా వెంటాడుతూనే ఉంటుంది. దాంతో మనం ప్రతిదీ అనుమానం గానే చూస్తాం. కరోనా వల్ల ప్రజలందరూ ఇప్పటికే భయపడుతున్నారు. మామూలు ప్రజలు అంత భయపడుతూ ఉంటే ఇంకా పేషంట్లని చూసే డాక్టర్లు ఇంకా మిగిలిన ఆస్పత్రి సిబ్బంది మామూలు వాళ్లకంటే ఎక్కువ భయపడతారు.

Video Advertisement

ప్రస్తుతం సమయం కరోనా వ్యాప్తి ఎక్కువ అవడంతో ఆసుపత్రి వాళ్లు కూడా ఏ పేషెంట్ వచ్చినా కరోనా అయ్యుండొచ్చు అన్న కారణంతో కరోనా టెస్ట్ కచ్చితంగా చేస్తున్నారు. ఒకవేళ టెస్ట్ చేసే వీలు లేకపోయినా సేఫ్టీ మెజర్మెంట్ కిట్ (పీపీఈ కిట్) అయితే కచ్చితంగా తీసుకెళ్తున్నారు. కానీ కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించవు. ఇలాంటి సంఘటన ఒకటి ఇటీవల చోటు చేసుకుంది.

హైదరాబాద్ లోని సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్పల్లి వాసి శ్రీనివాస్ బాబు పనిమీద కరీంనగర్ వెళ్లారు. కరీంనగర్ నుండి తిరిగి హైదరాబాద్ కి వస్తుండగా దారిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చినట్లు అనిపించింది. తట్టుకోలేక చేగుంట బైపాస్ రోడ్ దగ్గర బస్ ఆపి దిగేసారు. అక్కడి నుండి హాస్పటల్ 400 మీటర్ల దూరం. అక్కడ ఆరోగ్య కేంద్రం లో ఉన్న నర్సులు ఫస్ట్ ఎయిడ్ చేశారు. కానీ హాస్పిటల్ కి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండడంతో ఆంబులెన్స్ ని పిలిచారు. అక్కడ చుట్టూ ఉన్న జనాలు శ్రీనివాస్ ని వీడియో తీశారు.

వీడియోలో శ్రీనివాస్ తనని హాస్పిటల్ కి తీసుకెళ్లండి అని మాట్లాడారు.తూప్రాన్‌లో ఉన్న అంబులెన్స్ సిబ్బంది అరగంటలో అక్కడికి చేరుకున్నారు. శ్రీనివాస్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మాస్కులు ధరించి కొంచెం దూరంగా నిల్చొని ఉండటంతో అతనికి కరోనా ఉందేమోనని అనుమానపడ్డారు. వాళ్ల దగ్గర పీపీఈ కిట్ కూడా లేకపోవడంతో కరోనా కి అసైన్ చేసిన అంబులెన్స్ కోసం పై అధికారికి ఫోన్ చేశారు. ఆ అంబులెన్స్ అక్కడికి వచ్చే లోపు శ్రీనివాస్ మరణించారు.

ఆ గ్రామ డీఎంహెచ్వో మాట్లాడుతూ ఇదంతా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే నని. అంతకు ముందు కూడా ఇలానే ఒక వ్యక్తికి కరోనా ఉందేమో అని భయపడ్డారు అని, కానీ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది అని. మెదక్ జిల్లా మొత్తంలో 8 అంబులెన్స్ లు ఉంటే దాంట్లో 2 మాత్రమే కేటాయించారని.ఆ అంబులెన్స్ లకి  పీపీఈ కిట్లు సరఫరా చేస్తున్నామని, ఏదేమైనా పేషెంట్ ని హాస్పిటల్ కి చేర్చడం ఆ స్టాఫ్ బాధ్యత అని. తగినన్ని పిపిఈ కిట్లు లేకపోవడం వల్లే ఇలా జరిగిందని. ఆ స్టాఫ్ ని వీధుల్లో నుండి తీసేయాలని చెప్పారు.

అంబులెన్స్ డ్రైవర్ మాట్లాడుతూ ఇప్పటివరకు వారు కరోనా పేషెంట్ కోసం పని చేయలేదు అని. వారి దగ్గర రెండు పీపీఈ కిట్ లే ఉన్నాయని. అవి సరిపోవు అని. ఇంకా అంబులెన్స్ శానిటైజ్  చేయడానికి శానిటైజర్ కూడా ఎక్కువగా లేదు అని. శ్రీనివాస్ చుట్టూ ఉన్న వాళ్ళంతా కొంచెం దూరంగా ఉండడంతో అదికూడా గ్లౌజులు మాస్కులు ధరించి ఉండటంతో కరోనా ఉందేమో అని నర్సులు భయపడ్డారు అని చెప్పాడు.

జీవీకే ఈఎంఆర్ఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పి.బ్రహ్మానందరావు మాట్లాడుతూ కరోనా ఉందేమో అన్న అనుమానంతో హాస్పిటల్ కి తరలించకపోవడం తప్పు అని. ఆ అంబులెన్స్ సిబ్బందిని హైదరాబాద్ కి బదిలీ చేస్తూ చర్యలు తీసుకున్నామని చెప్పారు. శ్రీనివాస్ భార్య కళ్యాణి మాట్లాడుతూ శ్రీనివాస్ చనిపోయేముందు ఫోన్ చేశారని, పిల్లలు నాన్న జాగ్రత్త అని చెప్పారని. అంతా అయిపోయిందని. ఇంకో ఐదు నిమిషాల కంటే ఎక్కువ తను బతకరు అని. ఇంక ఇంటికి రాలేరు అని చెప్పారని కళ్యాణి అన్నారు.

60 ఏళ్ల శ్రీనివాస్ కి ఒక కొడుకు ఒక కుమార్తె. కుమార్తె స్పెషల్ చైల్డ్ అవ్వడంతో కళ్యాణి, శ్రీనివాస్ కలిసి దగ్గరుండి తన బాధ్యతలన్నీ చూసుకునే వాళ్ళు. శ్రీనివాస్ కొడుకు భాను చందర్ మాట్లాడుతూ తన తండ్రి ఎన్నో సంస్థలకు పని చేశారు అని. తనకి రావాల్సిన డబ్బు తీసుకోవడం కోసం కరీంనగర్ కి వెళ్ళారు అని. దారిలో ఇలా అయింది అని చెప్పారు. కళ్యాణి మాట్లాడుతూ ” మా కూతురు కి ఇప్పుడు 26 ఏళ్లు. తన తండ్రి రోజు జో కొట్టనిదే నిద్రపోదు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తనకి అన్ని మేము ఇద్దరం కలిసే చూసుకుంటాం. ఇప్పుడు నేను ఒక్క దాన్ని తనని ఎలా చూసుకోగలను?” అని అన్నారు.

source : bbc


End of Article

You may also like