Ads
ఉత్తరప్రదేశ్ లో అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ట 22 వ తేదీన జరుగుతుంది. దీని కోసం ఎంతో మంది ప్రముఖులకి ఆహ్వానం అందింది. అయితే ఈ క్రమంలో అయోధ్యలోని కొన్ని లగ్జరీ హోటళ్ల రూమ్ బుకింగ్ ధర కూడా పెరిగిపోయింది.
Video Advertisement
రామ మందిర ప్రాణ ప్రతిష్ట రోజున భారతదేశంలో నుండి కాకుండా వివిధ దేశాల నుండి ఎంతో మంది భక్తులు అయోధ్యకి వస్తారు. అలా వచ్చే వారి సంఖ్య దాదాపు 5 లక్షల వరకు ఉండొచ్చు అని అంచనా నెలకొంది. ఈ పరిస్థితిని గమనించిన స్థానిక హోటళ్ల యజమానులు రూమ్ ధరలని పెంచేశారు.
హోటల్ అయోధ్య ప్యాలెస్ లో ప్రస్తుతం రోజువారి గది అద్దె 18,500 రూపాయలు అని సమాచారం. సాధారణంగా అయితే అక్కడ గది అదే 3,700 రూపాయలు ఉంటుంది. ది రామాయణ హోటల్ అద్దె ఇప్పుడు 40,000. 2023 లో ఇందులో ఒక గది అద్దె 14,900 ఉండేది. సిగ్నెట్ కలెక్షన్ హోటల్ లో ఇప్పుడు ఒక రోజు అద్దె దాదాపు 70,500 రూపాయలు. గత సంవత్సరం జనవరిలో ఇక్కడ గది అద్దె 16,800 రూపాయలు. అయోధ్యలోని రామాయణ్ హోటల్ లోని గదుల బుకింగ్ 80% పూర్తి అయ్యింది అని సమాచారం.
ఈ హోటల్ లోని గదులు జనవరి 20 వ తేదీ నుండి జనవరి 23 వ తేదీ వరకు బుక్ అయ్యాయి. ఈ హోటల్ లో గది అదే ఒక్క రోజుకి 10,000 నుండి 25,000 రూపాయల వరకు పెరిగింది. ఇంకా కొద్ది రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అంతే కాకుండా అయోధ్యలోని పార్క్ ఇన్ రాడిసన్ లోని విలాసవంతమైన గది ఒక రోజుకి లక్ష రూపాయలు అద్దెతో బుక్ అయ్యింది. ఈ హోటల్ లోని మిగిలిన గదులు అన్నీ కూడా బుక్ అయ్యాయి అని హోటల్ యాజమాన్యం తెలిపారు. అంతకుముందు కూడా ఈ హోటల్ లో గది అద్దె దాదాపు 7,500 ఉండేది. అలా అయోధ్యలో ఉన్న హోటళ్ల ధరలు అన్నీ కూడా ఇప్పుడు పెరిగాయి, రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతాయి అని అంటున్నారు.
End of Article