Ads
గత కాంత కాలం నుండి అదానీ సంస్థ నష్టాల్లో ఉంది. ఈ అంశాన్ని పార్లమెంట్ లో సైతం మాట్లాడుతున్నా కూడా రోజుల తరబడి సభలు వాయిదా పడుతూనే ఉన్నాయి.
Video Advertisement
ఇంతకు జరుగుతున్నా సరే అదానీ సంస్థ మాత్రం వస్తున్న ఆరోపణలన్నిటిని ఖండిస్తూనే ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా సబ్స్క్రయిబ్ అయిన FPO ని రద్దు చేస్తూ ఇన్వెస్టర్లకి డబ్బులు అన్ని తిరిగి ఇచ్చేశారు.
ఇప్పుడు షేర్లపై తీసుకున్న రుణాలు మెచ్యూరిటీ ముందే చెల్లించడానికి నిర్ణయించుకున్నారు. తాకట్టు పెట్టిన షేర్లను విడిపించుకోవడానికి 1.11 బిలియన్ డాలర్ల రుణాలు ముందస్తుగానే చెల్లించాలి. సెప్టెంబర్ 2024 వరకు సమయం ఉంది. కానీ ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న పరిస్థితి కారణంగా మెచ్యూరిటీ కి ముందే రుణం తీర్చాలి అని అనుకుంటున్నారు. ఈ కారణంగా అదానీ పోర్ట్స్ & సెజ్ లో 9.34 శాతం, అదానీ ట్రాన్స్మిషన్ లో 10 శాతం, గ్రీన్ ఎనర్జీలో 5 శాతం విడిపించుకుంటున్నట్లు కంపెనీ ప్రకటనలో తెలిపింది.
చెప్పిన విధంగానే షేర్ల హామీ మీద తీసుకున్న రుణాలని ముందుగా చెల్లిస్తాము అని, ప్రమోటర్ల హామీకి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాము అని కంపెనీ ప్రకటించింది. గ్రూప్ కంపెనీలో బ్యాలెన్స్ షీట్, రుణం చెల్లించే సామర్థ్యంపై పెట్టుబడిదారుల్లో నెలకొన్న ఆందోళనను తగ్గించాలి అనే ఉద్దేశంతో ఈ తాకట్టులోని షేర్లను విడిపిస్తున్నారు అని కంపెనీ సోమవారం నాడు ప్రకటనలో తెలిపింది.
ఈ ప్రకటన బయటికి విడుదల అయిన తర్వాత అదానీ పోర్ట్స్ షేర్ 6 శాతంకి పైగా పెరిగి 528.40కి చేరాయి. నిఫ్టీ 50 లో టాప్ గెయినర్ గా నిలిచింది. కానీ అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ విల్మర్లు 5 శాతం, అదానీ ట్రాన్స్మిషన్ స్టాక్ 10 శాతం లోయర్ సర్క్యూట్ దగ్గర ఉన్నాయి. ఇంక అదాని ఎంటర్ప్రైజెస్ షేర్లు దాదాపు 2 శాతం క్షీణించాయి. ఇప్పుడు 1,564.90 దగ్గర ఉన్నాయి.
End of Article