మహేష్ బాబు “సిగరెట్లు” మానేయడం వెనక ఉన్నది ఎవరో తెలుసా? నమ్రత అనుకుంటే పొరపాటే.!

మహేష్ బాబు “సిగరెట్లు” మానేయడం వెనక ఉన్నది ఎవరో తెలుసా? నమ్రత అనుకుంటే పొరపాటే.!

by Mohana Priya

Ads

ప్రతి మనిషికి ఏదో ఒక చెడు అలవాటు ఉంటుంది. కొంతమందికి అది జీవితాంతం తోడు ఉంటే కొంతమంది మాత్రం అది తమకి ప్రమాదమని తెలిసి ఆ అలవాటు మార్చుకుంటారు. సినిమా వాళ్లు కూడా మనుషులే కాబట్టి వాళ్లు ఇందులో మినహాయింపు కాదు.

Video Advertisement

ఎంతో మంది సినీ తారలకు ఏదో ఒక అలవాటు ఉండే ఉంటుంది. అలా సూపర్ స్టార్ మహేష్ బాబు కి కూడా పొగ తాగడం అలవాటు ఉండేదట. ఒక్క రోజులో దాదాపు 3 – 4 పెట్టెల సిగరెట్లు కాల్చేవారట. ఈ అలవాటును మార్చుకుందామని నియంత్రించడానికి ఎంత ప్రయత్నించినా కూడా మానలేకపోయారట.

అప్పుడు ఒక స్నేహితుడు అలెన్ కార్ రాసిన ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్ అనే పుస్తకాన్ని మహేష్ బాబు కి బహుమతిగా ఇచ్చారట. ఆ పుస్తకం చదివి మహేష్ బాబు పొగ తాగటం మానేశారట.

మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో ఎన్నో సంవత్సరాల క్రితం తను పొగ తాగే అలవాటును ఎలా మానుకున్నారో చెబుతూ ఈ పుస్తకాన్ని చదవండి అని ట్వీట్ చేశారు. అంతేకాకుండా మహేష్ బాబు పొగ తాగే అలవాటును మానడానికి ఇంకొక కారణం కూడా ఉంది అని అంటారు. ఒకసారి ఒక ఇంటర్వ్యూ సమయంలో మహేష్ బాబు అభిమాని ఒకరు తన సినిమాలో మహేష్ బాబు పొగ తాగే స్టైల్ ని అనుకరించి చూపించారట. అచ్చం మహేష్ బాబు చేసినట్టే చేశారట ఆ అభిమాని.

అలా స్టైల్ అచ్చుగుద్దినట్టు అనుకరించడానికి ప్రాక్టీస్ చేసే సమయంలో ఆ అభిమాని ఎన్నోసార్లు సిగరెట్ కాల్చాడట. అప్పుడు మహేష్ బాబు పొగ తాగటం అనేది చెడు అలవాటు అని, తనని చూసి తన అభిమానులు కూడా ఇలాంటి చెడు అలవాట్ల జోలికి వెళ్లడం అంత మంచిది కాదు అని ఆలోచించి అప్పటినుండి తన సినిమాల్లో పొగ తాగే సన్నివేశాలను తొలగించమని దర్శకులకు చెప్తారట.

మహేష్ బాబు చివరిసారిగా తెరపై పొగ తాగిన సినిమా అతిధి. ఆ తర్వాత వచ్చిన ఏ సినిమాలోనూ పొగ తాగే సన్నివేశాలను చేయలేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కూడా సిగరెట్ నోట్లో పెట్టుకుంటారు కానీ వెలిగించరు. అలా మహేష్ బాబు పొగతాగే అలవాటును మానేశారట.

 


End of Article

You may also like