జైల్లో ఖైదీలకు నంబర్లు ఎలా ఇస్తారు..? చంద్రబాబు నాయుడుకి 7691 అనే నంబర్ ఎలా ఇచ్చారు..?

జైల్లో ఖైదీలకు నంబర్లు ఎలా ఇస్తారు..? చంద్రబాబు నాయుడుకి 7691 అనే నంబర్ ఎలా ఇచ్చారు..?

by kavitha

Ads

ఏపీ స్కిల్ డెవెలప్‌మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడును ఏపీ సిఐడి అరెస్టు చేసి, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఆయనకు జైలులో స్పెషల్ క్లాస్ కేటగిరీ వసతులు కలిపించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.

Video Advertisement

జైలులో చంద్రబాబుకు రిమాండ్ ఖైదీగా 7691 నంబర్ ను కేటాయించారు. ఈ నేపథ్యంలో అసలు ఖైదీలకు నంబర్లు ఎలా కేటాయిస్తారు?చంద్రబాబు నాయుడుకి 7691 అనే నంబర్ ఎలా ఇచ్చారు? అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం..
బీబీసి న్యూస్ తెలుగు కథనం ప్రకారం, ఒక వ్యక్తికి రిమాండ్ లేదా శిక్ష విధించిన అనంతరం ఆ వ్యక్తిని జైలుకు తరలిస్తారు. ఆ తరువాత ఆ ఖైదీకి నంబర్ ను కేటాయిస్తారు. జైలులో నంబరు కేటాయించే పద్ధతి వరుస సంఖ్య ప్రకారం ఉంటుంది. ఖైదీలను ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరిస్తారు.
1. రిమాండ్ ప్రిజనర్స్ ఈ ఖైదీలకు కేటాయించే నంబర్ రికార్డులో ఆర్.పి. అనే లెటర్స్ తర్వాత  ఉంటుంది.
2. కన్విక్టెడ్ ప్రిజనర్స్ కేటాయించే నంబర్ రికార్డులో సి.పి. అనే లెటర్స్ తర్వాత ఉంటుంది.
3. డిటెన్యూ ప్రిజనర్స్  అని కలెక్టర్ లేదా ఆర్డీవో లేదా తహసీల్దార్ రిమాండ్ చేసిన వారిని డిటెన్యూ ప్రిజనర్స్ అని  పిలుస్తారు.
4. విమెన్ ప్రిజనర్స్ అంటే మహిళా ఖైదీలు.
ప్రస్తుతం పైన చెప్పిన నాలుగు కేటగిరీల క్రిందనే ఖైదీలకు నంబర్లు కేటాయిస్తున్నారు. ఇక నంబర్ ఎలా ఇస్తారంటే, జైలు ఏర్పటు చేసినప్పటి నుండి వస్తున్న ఖైదీల క్రమ సంఖ్య ఆధారంగా ఆయా కేటగిరీల క్రింద నంబర్ కేటాయిస్తారని తెలంగాణ జైళ్ల శాఖ మాజీ డిఐజి ఒకరు బీబీసీతో చెప్పారు.
రిమాండ్ ఖైదీ అంటే, ”నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పై తగిన ఆధారం దొరికినపుడు పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో లేదా మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు. ఇలా చేయడాన్ని రిమాండ్ అంటారు. కోర్టులో జడ్జి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తే ఆ వ్యక్తిని జైలుకు తరలిస్తారని బీబీసీతో తెలంగాణ హైకోర్టు సీనియర్ లాయర్ చింతపల్లి లక్ష్మీనారాయణ చెప్పారు. చంద్రబాబు నాయుడికి రిమాండ్ ఖైదీ వరుస సంఖ్యను బట్టి 7691 నంబర్ ను కేటాయించారని తెలుస్తోంది.

Also Read: చంద్రబాబు నాయుడు మీద నమోదు చేసిన సెక్షన్స్ ఏంటి..? వాటికి ఎలాంటి శిక్షలు ఉంటాయి అంటే..?


End of Article

You may also like