Ads
పాఠశాల, యాత్ర, ఆనందో బ్రహ్మ లాంటి చిత్రాలతో డీసెంట్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న మహి వి.రాఘవ్ ఇటీవల ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో తాజాగా ‘సైతాన్’ అనే వెబ్ సిరీస్‌తో మహి వి.రాఘవ్ తెరకెక్కించారు. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ కాగా, దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం.
Video Advertisement
- వెబ్ సిరీస్ : సైతాన్
- నటీనటులు : రిషి, షెల్లీ, రవి కాలే, జాఫర్ సాదిక్,దేవయాని శర్మ,కామాక్షీ భాస్కర్ల, నితిన్ ప్రసన్న, మణికందన్ తదితరులు
- నిర్మాత : మహి వి రాఘవ్, చిన్నా వాసుదేవ్ రెడ్డి
- దర్శకత్వం : మహి వి రాఘవ్
- ఛాయాగ్రహణం : షణ్ముగ సుందరం
- సంగీతం : శ్రీరామ్ మద్దూరి
- ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
- ఎపిసోడ్స్ : 9
- విడుదల తేదీ: జూన్ 15, 2023
స్టోరీ:
సావిత్రి (షెల్లీ నబు కుమార్)కి ముగ్గురు పిల్లలు బాలి (రిషి),గుమ్తి (జాఫర్ సాధిక్), జయ (దేవయాని శర్మ).ఆమెను భర్త వదిలివేయడంతో తన ముగ్గురు పిల్లల పోషణ కోసం విధిలేని పరిస్థితుల్లో సావిత్రి యాకుబ్ అనే కానిస్టేబుల్ తో సహజీవనం చేస్తుంది. తన తల్లి గురించి చుట్టుపక్కలవారు చెడుగా మాట్లాడుతుంటే బాలి తల దించుకుని బ్రతకాల్సి వస్తుంది. బాలి తన కుటుంబాన్ని కష్టపడి పోషించాలని భావిస్తాడు. కానీ బాలికి ఎవరు పని ఇవ్వరు.
బాలి రక్తాన్ని చూస్తేభయపడుతుంటాడు. అలాంటి బాలి అనుకోని పరిస్థితుల్లో తల్లి కోసం వచ్చే కానిస్టేబుల్ తల నరికి, పోలీస్ స్టేషన్ లో లొంగిపోతాడు. జైలు నుండి బయటికి వచ్చిన బాలి తనవారికి అండగా ఉన్నాడా? బాలి నేరస్థుల జాబితాలో మోస్ట్ వాంటెడ్ గా ఎందుకు ఉన్నాడు? బాలి జీవితం చివరకు ఏమైంది? అనే విషయలు తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.రివ్యూ:
సినిమాలలో చూపించలేని ఎరోటిక్, బోల్డ్ కథాంశాల్ని ఆడియెన్స్ కి చెప్పడానికి ఓటీటీ వేదికగా మారింది. ఈ సైతాన్ కూడా అలాంటి స్టోరీనే. ఇది బాలి కథ. తాను, తన ఫ్యామిలిని బతికించుకోవడం కోసం తప్పని పరిస్థితుల్లో నేరస్తుడిగా మారిన వ్యక్తి బాలి. ఇలాంటి కథలు గతంలో చాలా వచ్చాయి. అయితే దర్శకుడు ఈ కథను హార్డ్ హిట్టింగ్ వేలో ఆడియెన్స్ కు చూపించేందుకు ప్రయత్నం చేశారు. ఇందులో ప్రధాన పాత్రలు చెప్పే ప్రతి డైలాగ్‌లోనూ ఒక బూతు వినిపిస్తుంటుంది.
ఎరోటిక్ సన్నివేశాల విషయంలో మూవీ టెక్నిక్స్ అనుసరించకుండా దర్శకుడు బోల్డ్‌గా చూపించాడు. బాలి పగ తీర్చుకునే సీన్స్ లో హింస, రక్తపాతం ఎక్కువగా ఉంది. మొత్తం 9 ఎపిసోడ్ లతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.బాలి చిన్నతనం, రక్తం చూస్తే భయపడే బాలి నేరస్తుడిగా ఎలా మారాడు అనేది ఎమోషనల్‌గా చూపించారు. నగల షాప్ ఓనర్ మోసం చేయడంతో బాలి విప్లవ దారిలో వెళ్ళడం సిరీస్ లో కొత్త టర్న్.
బాలి కళావతి పై ఇష్టంతో దళంలో చేరి, గొప్ప లీడర్ గా ఎలా ఎదిగాడు అనేది యాక్షన్ సీన్స్,పగ వంటి వాటితో నడిపించారు. బాలి పాత్రకు రుషి పూర్తిగా న్యాయం చేశాడు. అమాయకంగా కనిపిస్తూనే క్రూయాలిటీని చూపించాడు. జయగా దేవయాని బోల్డ్ పాత్రలో నటనతో ఆకట్టుకుంది. రవికాలే, కామాక్షి భాస్కర్ల, జాఫర్ సాధిక్ వారి నటనతో మెప్పించారు.
ప్లస్ పాయింట్స్:
- బాలిగా రిషి నటన,
- నిర్మాణ విలువలు,
మైనస్ పాయింట్లు:
- స్క్రీన్ ప్లే,
- బోల్డ్ డైలాగ్స్,
- హింస, రక్తపాతం
రేటింగ్:
3/5
టాగ్ లైన్ :
‘సైతాన్’ కుటుంబంతో కలిసి చూసే వెబ్ సిరీస్ కాదు ఒంటరిగా చూసే వారు వీకెండ్ లో టైం పాస్ కోసం ఒకసారి చూడవచ్చు.
watch trailer :
https://www.youtube.com/watch?v=XP6-yZoDQio&ab_channel=Disney%2BHotstarTelugu
Also Read: ఫ్లాప్ టాక్ తో కూడా డబ్బులు రాబట్టిందా..? ఎంతంటే..?
End of Article