SANIA MIRZA: విడాకుల కోసం “సానియా మీర్జా” తన మాజీ భర్త నుండి ఎంత భరణం తీసుకుందో తెలుసా.?

SANIA MIRZA: విడాకుల కోసం “సానియా మీర్జా” తన మాజీ భర్త నుండి ఎంత భరణం తీసుకుందో తెలుసా.?

by Harika

Ads

భారత టెన్నిస్ క్రీడాకారిని సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సానియా మీర్జా ‘పెళ్లి కష్టం.. విడాకులు కష్టం’ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ చేసింది.

Video Advertisement

సానియా మీర్జా పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను 2010లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో వీరి వివాహం సంచలనం అయింది.ఈ జంటకు కుమారుడు ఇజాన్ 2018లో జన్మించారు. అయితే గత కొద్ది రోజులుగా వీరిద్దరూ విడిపోతున్నారని రూమర్స్ బాగా వ్యాపించాయి. దానికి అనుకూలంగా సోషల్ మీడియా ఖాతాలో నుండి సానియా మీర్జా తన భర్త ఫోటోలు డిలీట్ చేసింది. వెంటనే షోయబ్ మాలిక్ కూడా తన ఖాతాలో సానియా మీర్జా పేరు తొలగించాడు. ఇది విడాకుల రూమర్ కి మరింత బలం చేకూర్చింది. అయితే ఇజాన్ సానియా దగ్గరే దుబాయ్ లో ఉండగా, షోయబ్‌ మాలిక్‌ ఎక్కువగా పాక్ లో ఉంటున్నాడు. విడాకుల పై ఇద్దరు బహిరంగంగా మాట్లాడలేదు.

డైవర్స్ గురించి వార్తలు వైరల్ అవుతున్న సమయంలో షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకున్నాడు. షోయబ్ మాలిక్ పాకిస్తానీ నటి సనా జావేద్ ను మూడో పెళ్లి చేసుకుని ఆ ఫోటోలు ఇటీవలే సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు అనేది ఖాయం అయిపోయింది.

సనా జావేద్‍ను పాకిస్థాన్ కు చెందిన నటి మరియు మోడల్.ఆమె 2012లో ‘షెహర్-ఎ-జాత్‌’ తో బుల్లితెర పై అడుగుపెట్టింది. ఆ తరువాత అనేక సీరియల్స్‌లో నటించింది. 2017లో డానిష్ మెహ్రునిసా వి లబ్ యు అనే సోషియో-కామెడీ మూవీతో సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. అనేక చిత్రాలలో నటించిన సన ఎన్నో అవార్డులు అందుకుంది. 2020లో సింగర్ ఉమైర్ జస్వాల్‌ను పెళ్లి చేసుకుంది. 2023లో నవంబర్ 28న అతనికి విడాకులు ఇచ్చింది. తాజాగా షోయబ్ మాలిక్‌ని రెండవ సారి పెళ్లి చేసుకుంది. మాలిక్, సనా జావేద్ రిలేషన్ లో ఉన్నారని గత ఏడాది నుండి రూమర్లు వస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా.. వీరిద్దరూ విడిపోవడంతో సోషల్ మీడియాలో సానియా తన మాజీ భర్త దగ్గర ఎంత భరణం తీసుకుంది అనేది చర్చనీయాంశం అయ్యింది. అయితే సానియా మాత్రం భర్త షోయబ్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అంట. పైసా కూడా అక్కర్లేదు అని తేల్చి చెప్పేసింది అంట. విడాకుల పేపర్లపై సంతకం చేసి అక్కడ నుంచి వచ్చేసింది అంట. ఈ వార్త చూసి నెటిజెన్స్…”ఇండియన్ గర్ల్స్ అంటే అది రేంజ్” అంటూ సానియాని పొగుడుతున్నారు.

 


End of Article

You may also like