ఒక్క కరోనా పేషెంట్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా?

ఒక్క కరోనా పేషెంట్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా?

by Megha Varna

Ads

కరోనా బారిన పడ్డారు అనే సమాచారం వస్తే చాలు.వారి ఇంటికి వెళ్లి మరి హాస్పిటల్ కు తరలిస్తున్నారు.చికిత్స చేస్తున్నారు .పూర్తిగా నయం అయ్యాక సొంత కార్చలతో డిశ్చార్జ్ చేస్తున్నారు.లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయ మార్గాలు అన్ని ఆగిపోయాయి.95 శాతం ఆదాయం పడిపోయింది.అయినా సరే కరోనా ను అదుపు చేసేందుకు కోట్లు ఖర్చుపెడుతుంది తెలంగాణ ప్రభుత్వం.

Video Advertisement

పాజిటివ్ వ్యక్తులకు గాంధీ హాస్పిటల్ లో నాణ్యమైన సేవలు అందిస్తుందని కేంద్ర బృందం మెచ్చుకుంది.డబ్బులు అయిపోతున్నాయి అని ఆలోచించకుండా ,ఒక్కో పేషెంట్ కు లక్షలు ఖర్చుపెడుతూ తిరిగి పూర్తిగా కోలుకొని ఇంటికి వెళ్ళేలాగా చర్యలు తీసుకుంటుందని అంది .వైరస్ పరీక్షా నుండి చికిత్స చేయించుకొని ఇంటికి వెళ్ళేదాకా ఒక్కో వ్యక్తికీ అయ్యే ఖర్చు 3 . 5 లక్షల రూపాయలు.ఇది వైద్య నిపుణులు వెల్లడిస్తున్న కచ్చితమైన లెక్క.ఇప్పటిదాకా నమోదైన కేసులకు 36 .54 కోట్ల రూపాయలను ఖర్చు చెయ్యగా..డిశ్చార్జ్ అయినవారికి 16 .24 కోట్లు రూపాయలు ఖర్చయినట్టు అంచనా..

కరోనా నిర్దారణకు పరీక్షకు 4500 రూపాయలు ..పాజిటివ్ కేసులకు ట్రీట్మెంట్ తర్వాత మరో రెండుసార్లు నిర్దారణ పరీక్షలు చేస్తారు.ఇలా ఒక్కొక్కరికి 13 ,500 వ్యయం. అనుమానితులను అంబులెన్సులోనే తీసుకువెళ్లి పరీక్షలు చేస్తారు.ఆ తర్వాత కోలుకున్న వారిని ఇంటికి చేరవేయడానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది.దానికి అయ్యే రవాణా ఖర్చు 4 వేల రూపాయలు.పాజిటివ్ గా నిర్దారణ అయినా వ్యక్తి పూర్తిగా కోలుకునే దాకా 80 రకాల ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ లను ఉపయోగిస్తారు.ఒకసారి వాడేసిన ఎక్విప్మెంట్లు తర్వాత పనికిరావు.పిపిఈ కిట్ ధర 2500 రూపాయలు .2 లక్షల రూపాయల దాకా ఈ కిట్లకే ఖర్చవుతుంది ..

ఇక కోవిడ్ సోకినా వారిలో రోగ నిరోధకశక్తీ పెంచేందుకు ఆంటిబయోటిక్ మెడిసిన్ ,అంటివైరల్ మందులు ,ఫ్లూయిడ్స్ ,ఇతరత్రా మందులకు మరో 50 వేలు.గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికీ బలమైన ఆహారం అందిస్తున్నారు.ఉదయం అల్పాహారం ,రెండుసార్లు భోజనం ,డ్రై ఫ్రూట్స్ ,పాలు ,బ్రేడ్ ,నాలుగు వాటర్ బాటిల్స్ అందచేస్తున్నరు..

వాస్తవానికి కరోనా మెనూ చాలా ఖరీదు.55 వేల రూపాయల సబ్బులు ,శానిటైజర్,ప్రత్యేక డ్రెస్సులాంటి వాటికోసం మరో 27 వేలు.కరోనా సోకినా వ్యక్తుల్లో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వైరస్ ప్రభావం చూపుతుంది.దానిని బట్టి చికిత్సకు సమయం ఎక్కువ లేదా తక్కువ పడుతుంది.మాములుగా 14 రోజులలో కోలుకొని డిశ్చార్జ్ అవుతున్నారు.వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో 21 రోజుల వరకు చికిత్స అందించాల్సి ఉంటుంది.

 


End of Article

You may also like